హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12సీట్లు గెలుస్తున్నాం...నాలుగు కేంద్ర మంత్రి పదవులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం (జూన్ 1) సాయంత్రం లోక్ సభ ఎన్నికల సుదీర్ఘ ప్రక్రియ ముగియడంతో సర్వే సంస్థలు తమ ఎగ్జిల్ పోల్స్ వెల్లడించాయి.
లోక్ సభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..రాష్ట్రాల వారీగా ఎగ్జిల్ పోల్స్ సంస్థలు తమ సర్వే రిపోర్టులను చెబుతు న్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ కు అధిక సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
పోల్స్ సంస్థలు తమ సర్వే రిపోర్టులను చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. తెలంగాణలో కాంగ్రెస్ కు అధిక సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కు తెలంగాణ సెంటిమెంట్ లేదు.. కేవలం వ్యాపారం మాత్రమే ఉంది.. సెంటిమెంట్ వాడుకుని కేసీఆర్ లాభపడ్డాడు. సచివాలయ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మక్క, సారలమ్మ, జంపన్నలను చంపిన వారిగానే కాకతీయ రాజులను చూస్తాం.. టీజీ అన్నది తెలంగాణ పిల్లల గుండెల్లో నుంచి వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాదు.. కమర్షియల్ వ్యాపారి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.