పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్నిచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖర్గే, సోనియా దిశానిర్ధేశంతో మంచి ఫలితాలు సాధించామని స్పష్టం చేశారు. వంద రోజుల పాలను ప్రజలు ఆదరించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మా ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు.
కాంగ్రెస్ పాలనను మెచ్చుకుని ప్రజలు ఓటేశారని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. 2019లో మూడు ఎంపీ సీట్లు ఇస్తే 2023లో ఆ సంఖ్య 8కి పెరిగిందని చెప్పారు. బీజేపీ గెలిచిన 8 సీట్లలో బీఆర్ఎస్ 7 చోట్లలో డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించారన్నారు సీఎం రేవంత్. బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ బలహినమైన అభ్యర్థులను పెట్టారంటూ ఆరోపించారు.
సిద్దిపేటలో హరీష్ రావు బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, హరీష్ కలిసి మెదక్ లో బీజేపీని గెలిపించారని తెలిపారు. వెంకట్రామిరెడ్డిని నమ్మించి మోసం చేశారని తెలిపారు. 37 శాతం ఓట్లున్న బీఆర్ఎస్ కు 16 శాతానికి చేరిందన్నారు. ఇక దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య వాదులును రాహుల్ గాంధీ ఏకం చేశారని చెప్పారు సీఎం రేవంత్. మోదీ వ్యతిరేక విధానాలను రాహుల్ ప్రజలకు వివరించారు.