ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదన్నారు. NDA మిత్రపక్షాలు మోదీని రాజీనామా కోరాలన్నారు. మోదీ హుందాగా రాజీనామా చేసి ప్రధానిగా తప్పుకుంటే బాగుంటుదని తెలిపారు. రాజకీయ విలువలు చెప్పడానికే మోదీ కానీ వాటిని పాటించరని విమర్శించారు. రాముడి పేరుతో ఓట్లు అడిగితే దేవుడే గుణపాఠం చెప్పాడన్నారు. జూన్ 5 బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్లమెంట్ ఎన్నికల్లో NDA, INDIA కూటమికి సమానంగా ఫలితాలు వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి . మోదీ గ్యారెంటీ పేరుతో వెళ్తే జనం తిప్పికొట్టారని చెప్పారు. మోదీ కాలం చెల్లిందని ప్రజలు తీర్పు చెప్పారన్నారు. ఎన్నికల ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివని చెప్పారు.
ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరసావహిస్తామని అన్నారు సీఎం రేవంత్. గెలుపు, ఓటమి అన్నీటికీ పీసీసీ చీఫ్ గా, సీఎంగా తనదే బాధ్యత అని చెప్పుకొచ్చారు. తమకు ఎవరితో ఎలాంటి భేషాజాలు చెప్పిన సీఎం రేవంత్... రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడుతామన్నారు. ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.