
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నార మంత్రి పొన్నం ప్రభాకర్. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎన్నికల ప్రచారలో భాగంగా ఫిబ్రవరి 24 న SRR కళాశాలలో మైదానంలో సీఎం బహిరంగ సభ ఉంటుందన్నారు పొన్నం.
కరీంనగర్ జిల్లా అభివృద్ధికి తాము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా, ఇంజినీరింగ్ కళాశాలలు రాబోతున్నాయని చెప్పారు. బండి సంజయ్ కాంగ్రెస్ ను బద్నామ్ చేస్తున్నారని మండిపడ్డారు పొన్నం. ఆయనకు పట్టభద్రుల ఎన్నికల్లో ఓటే లేదన్నారు. ఆరేళ్లలో తెలంగాణకు ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పి బండి సంజయ్ ఓట్లు అడగాలన్నారు.
Also Read :- సహయక చర్యల్లో వేగం పెంచండి
బీసీ రిజర్వేషన్ పై తెలంగాణ అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత కేంద్రంలో బిల్లు తెచ్చే బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఈబీసీ వాళ్ళు కూడా బీసీనే..అందులో ముస్లింలు లేరా? అని ప్రశ్నించారు. ప్రతీది రాజకీయం చేయొద్దన్నారు పొన్నం. 15 శాతం కమిషన్ తీసుకుంటున్నారని బండి సంజయ్ తమపై చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో ముందు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డికి 30కోట్లు ఇచ్చామని చెబుతున్నారు..పైసలు ఇస్తే తీసుకొని కాంగ్రెస్ కి ఓటు వెయ్యాలన్నారు పొన్నం.