కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాను ఇచ్చిన హామీలపై మే 09వ తేదీన అమరవీరుల స్థూపం వద్ద దగ్గర చర్చకు రావాలన్నారు.  కేసీఆర్ విధానం మార్చుకోకపోతే చరిత్ర హీనుడిగా మిగులుతారని చెప్పారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోచమ్మ మైదాన్ చౌరస్తా కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.  కడియం శ్రీహరి ముప్పై ఏళ్లుగా చిత్తశుద్ధితో రాజకీయాల్లో పనిచేశారని.. అందుకే ఆయన కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇచ్చామన్నారు సీఎం రేవంత్. 

 రైతు భరోసా డబ్బులు ఇద్దామంటే బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకున్నాయని ఆరోపించారు.  బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ భూములు మింగిన అనకొండ అంటూ విమర్శించారు.  పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు ఏమీ ఇవ్వలేదన్నారు సీఎం.  వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని..  స్పెషల్ డెవలప్ మెంట్ కింద వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని గుడి, దర్గా, చర్చీ అభివృద్ధి కోసం రూ. 3కోట్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.