విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారం (24 జనవరి) ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎంకు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

విదేశీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి టీమ్ దావాస్ లో మూడు రోజులు పర్యటించింది. దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్న సీఎం.. వివిధ దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రాష్ట్రానికి మొత్తం 79 వేల 950 కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నారు. 

 దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రంతో 20 విదేశీ కంపెనీల ఒప్పందాలు చేసుకున్నాయి. రాష్ట్రానికి మొత్తం 79 వేల 950 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ఈ కొత్త ఒప్పందాలతో 49 వేల 500 ఉద్యోగాలు రానున్నాయి. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే అతిపెద్ద రికార్డుగా చెబుతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సారి 4 రెట్లు అధికంగా పెట్టుబడులు పెట్టనున్నాయి విదేశీ కంపెనీలు.