ట్యాంక్ బండ్ పై దశాబ్ది వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్, గవర్నర్

ట్యాంక్ బండ్ పై దశాబ్ది వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్, గవర్నర్

ట్యాంక్ బండ్ దగ్గర జరగుతున్న తెలంగాణ అవిర్భావ వేడుకలు సీఎం రేవంత్, గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. వీరితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, కోదండరాం, కవి అందే శ్రీ, పలవురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి,  కాంగ్రెస్ నాయకులు తదితరులు హాజరయ్యారు.  

ట్యాంక్ బండ్ పై నవశకానికి నాంది పలుకుతూ 11 సంవత్సరం లోకి అడుగుపెట్టబోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఆవిర్భావ వేడుకలకు వస్తున్న వారికోసం 80కి పైగా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు.  రాత్రి 7.30 నిమిషాలకు లెజర్ షో ఉండనుంది. ఆవిర్భావ వేడుకల్లో వందల సంఖ్యలో కళాకారులు పాల్గొంటున్నారు. కళాకారుల ప్రదర్శనల సమయంలో పూర్తి తెలంగాణ గీతాన్ని  వినిపించనున్నారు.  లైటింగ్, భారీ LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ఇప్పటికే  ఏర్పాట్లను పరిశీలించారు.