తప్పు చేయకుంటే కేటీఆర్ బామ్మర్ధి ఎందుకు పారిపోయాడు : సీఎం రేవంత్ రెడ్డి

తప్పు చేయకుంటే కేటీఆర్ బామ్మర్ధి ఎందుకు పారిపోయాడు : సీఎం రేవంత్ రెడ్డి

జన్వాడ ఫాంహౌస్ లో ఏమీ జరక్కపోతే.. దీపావళి దావత్ మాత్రమే అయితే కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఎందుకు పారిపోయాడు అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పారిపోయిన రాజ్ పాకాల ముందస్తు బెయిల్ ఎందుకు కోరుతున్నాడు అంటూ నిలదీశారు సీఎం. 2024, అక్టోబర్ 29వ తేదీ ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా చాలా ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు.

మాకు దీపావళి పండుగ అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు అంటూ సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీపావళి దావత్ సారా బుడ్లుతో చేస్తారా.. ఇలా చేస్తారని మాకు తెలియదు అంటూ చురకలు అంటించారాయన. రాజ్ పాకాల ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడు అని ప్రశ్నిస్తూనే.. కోర్టులో బెయిల్ కోసం ఎందుకు అప్లయ్ చేశాడు అంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి. 

ALSO READ | కేటీఆర్.. ఏడు రోజుల్లో సారీ చెప్పు..లేదంటే లీగల్ గా వెళ్తా: బండి సంజయ్

దావత్ చేసుకుంటుంటే క్యాసినో కాయిన్స్ ఎక్కడి నుంచి వచ్చాయ్.. విదేశీ మద్యం ఎందుకు దొరికింది.. ఫ్యామిలీ పార్టీలో ఇలాంటివి ఎందుకు ఉన్నాయ్ అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.