‘సీతారామ’ నిర్వాసితులకు రూ.50 కోట్లు విడుదల

‘సీతారామ’ నిర్వాసితులకు రూ.50 కోట్లు విడుదల

సత్తుపల్లి, వెలుగు  :  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థన మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ సీతారామ ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు రూ.50 కోట్లు విడుదల చేశారు. సీతారామ ప్రాజెక్ట్ పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను తీసుకురావడమే తన రాజకీయ లక్ష్యమని  మంత్రి తుమ్మల పలుమార్లు ప్రకటించారు. ఈ క్రమంలో సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం  చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. భూ సేకరణ నిధులు విడుదల చేయటంతో నిర్వాసితులు తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు.