దక్షణ కుంభమేళా, మేడారం జాతరను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించడం సాధ్యం కాదని కేంద్రమంతి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఇది గిరిజనులను అవమానించడం తప్ప మరోకటి కాదన్నారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.
మేడారం జాతరను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సందర్శించుకోవాలని, సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవాలని కోరారు. అయోధ్య రాముడిలాగే దక్షణ కుంభమేళా మేడారం జాతరను దర్శించుకోవాలని చెప్పారు. శుక్రవారం మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న అనంతరం సీఎం ఈ కామెంట్స్ చేశారు.
గతంలో మేడారం జాతరకు వెళ్లకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకున్నారని... మేడారంపై వివక్ష చూపిస్తే కేంద్రానికి కూడా అదే గతి పడుతుందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తర, దక్షిణ భారతం అంటూ వేరువేరుగా చూడోద్దన్నారు.
మేడారం జాతరకు రూ.110 కోట్లు మంజూరు చేశామన్న సీఎం.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నీ ఏర్పాట్లు చేశామన్నారు. ఇక త్వరలో రైతులకు త్వరలో గుడ్ న్యూస్ చెబుతామన్నారు సీఎం. రైతులకు రెండు లక్షల రూణమాఫీ చేసేందుకు బ్యాంకులతో చర్చిస్తున్నట్లుగా సీఎం రేవంత్ తెలిపారు.