రూ.1,800 కోట్ల గ్రాంట్​ ఇవ్వండి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​కు సీఎం రేవంత్​ వినతి

రూ.1,800 కోట్ల గ్రాంట్​ ఇవ్వండి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​కు సీఎం రేవంత్​ వినతి
  • వెనుక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డిన జిల్లాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రావాల్సిన పెండింగ్ నిధులు రిలీజ్​ చేయండి
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​కు సీఎం రేవంత్​ వినతి
  • ఉమ్మడి సంస్థల నిర్వహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ వ్యయం 408 కోట్లు ఏపీ నుంచి ఇప్పించండి 
  • కాజీపేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నెల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కొల్పాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పున‌‌ర్విభ‌‌జ‌‌న చ‌‌ట్టం –2024 లో పేర్కొన్న విధంగా తెలంగాణ‌‌లోని వెనుక‌‌బ‌‌డిన జిల్లాల‌‌కు కేంద్రం నుంచి రావాల్సిన రూ.1,800 కోట్ల పెండింగ్‌‌ నిధులను వెంట‌‌నే విడుద‌‌ల చేయాల‌‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ‌‌న్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​తో పార్లమెంట్ లోని ఆమె చాంబ‌‌ర్‌‌లో భేటీ అయ్యారు. ఈ సంద‌‌ర్భంగా తెలంగాణలోని వెనుక‌‌బ‌‌డిన జిల్లాల‌‌కు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్​పై చ‌‌ర్చించారు.

రాష్ట్రంలోని 9 జిల్లాల‌‌కు ఏటా రూ.450 కోట్ల చొప్పున గ్రాంటు విడుద‌‌ల చేయాలని విభజన చ‌‌ట్టంలో పొందుపరిచిన అంశాన్ని గుర్తు చేశారు. ఇందులో భాగంగా 2019–20, 2021–22, 2022–23, 2023–24 పైనాన్షియల్ ఇయర్స్​కు సంబంధించిన గ్రాంట్ ఇప్పటి వ‌‌ర‌‌కు విడుద‌‌ల కాలేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నాలుగేండ్లకు క‌‌లిపి పెండింగ్‌‌లో ఉన్న మొత్తం రూ.1,800 కోట్ల గ్రాంటును తక్షణమే రిలీజ్ చేయాలని కోరారు. అలాగే, రాష్ట్ర విభజన త‌‌ర్వాత హైద‌‌రాబాద్‌‌లోని హైకోర్టు, రాజ్ భ‌‌వ‌‌న్‌‌, లోకాయుక్త, రాష్ట్ర మాన‌‌వ హ‌‌క్కుల క‌‌మిష‌‌న్‌‌, జ్యుడీషియ‌‌ల్ అకాడ‌‌మీ స‌‌హా ఇత‌‌ర ఉమ్మడి సంస్థల నిర్వహ‌‌ణ‌‌ను తెలంగాణ ప్రభుత్వమే భ‌‌రించిందని వివరించారు. ఆయా సంస్థల విభ‌‌జ‌‌న పూర్తయ్యే వ‌‌ర‌‌కు నిర్వహ‌‌ణ‌‌కు అయిన రూ.703.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భ‌‌రించింద‌‌ని, అందులో ఏపీ వాటా రూ.408.49 కోట్లను తెలంగాణ‌‌కు చెల్లించాల్సి ఉంద‌‌ని తెలిపారు.

ఆ మొత్తం చెల్లింపున‌‌కు ఏపీ స‌‌మ్మతి తెలిపింద‌‌ని,  కేంద్ర హోం శాఖ సైతం ఆ మొత్తం తెలంగాణ‌‌కు చెల్లించాల‌‌ని ఏపీకి లేఖ‌‌లు రాసింద‌‌ని సీఎం వివ‌‌రించారు. అయిన‌‌ప్పటికీ ఇప్పటివ‌‌ర‌‌కూ ఆ మొత్తాన్ని తెలంగాణ‌‌కు ఏపీ చెల్లించలేద‌‌ని, ఆ రూ.408.49 కోట్లను వ‌‌డ్డీతో స‌‌హా తెలంగాణ‌‌కు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల‌‌ని రిక్వెస్ట్ చేశారు. 

రుణాల పంపిణీపై సమీక్షించండి

విదేశీ ఆర్థిక స‌‌హాయంతో చేప‌‌ట్టిన ప్రాజెక్టుల‌‌కు సంబంధించి ఏపీ, తెలంగాణ మ‌‌ధ్య రుణాల పంపిణీ విష‌‌యంలో తెలంగాణ నుంచి రూ.2,547.07 కోట్ల రిక‌‌వ‌‌రీకి కేంద్రం ఏక‌‌ప‌‌క్షంగా ఆదేశాలు ఇచ్చింద‌‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం రేవంత్​ తీసుకెళ్లారు. ఈ విష‌‌యంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర‌‌స‌‌న తెలిపినా ప‌‌ట్టించుకోలేదని, ఈ విష‌‌యంపై మ‌‌రోసారి స‌‌మీక్షించి, స‌‌రైన నిర్ణయం తీసుకోవాల‌‌ని కోరారు. కేంద్ర ప్రాయోజిత ప‌‌థ‌‌కాల‌‌కు సంబంధించిన నిధుల‌‌న్నింటినీ 2014–15లో కేవ‌‌లం ఏపీకే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విష‌‌యాన్ని నిర్మలా సీతారామ‌‌న్‌‌కు  గుర్తు చేశారు.

విభజన చ‌‌ట్టంలోని జ‌‌నాభా ప్రాతిప‌‌దిక‌‌న ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణ‌‌కు రూ.495.20 కోట్లు స‌‌ర్దుబాటు చేయాల్సి ఉంద‌‌న్నారు. అకౌంటెంట్ జ‌‌న‌‌ర‌‌ల్‌‌, ఏపీ ప్రభుత్వానికి తాము ప‌‌లుమార్లు విజ్ఞప్తి చేసినా.. ఆ మొత్తాన్ని తెలంగాణ‌‌కు స‌‌ర్దుబాటు చేయడం లేద‌‌ని కేంద్ర మంత్రి నోటీసుకు తెచ్చారు. ఈ విష‌‌యంలో జోక్యం చేసుకొని తెలంగాణ‌‌కు రావాల్సిన నిధులు ఇప్పించాల‌‌ని విజ్ఞప్తి చేశారు. 

కాజీపేట‌‌లో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నెల‌‌కొల్పండి 

ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాజీపేట‌‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెల‌‌కొల్పాల‌‌ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు మ‌‌ల్లు ర‌‌వి, గ‌‌డ్డం వంశీకృష్ణ, చామ‌‌ల కిర‌‌ణ్ కుమార్ రెడ్డి, ర‌‌ఘువీర్ రెడ్డి, సురేశ్ షెట్కార్‌‌, కావ్య, ఎం.అనిల్ కుమార్ యాద‌‌వ్ ఉన్నారు. కాజీపేట‌‌లో పీరియాడిక‌‌ల్ ఓవ‌‌ర్‌‌ హాలింగ్ (పీవోహెచ్‌‌) వ‌‌ర్క్‌‌షాప్ ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రక‌‌టించింద‌‌ని సీఎం తెలిపారు. ఆ త‌‌ర్వాత కూడా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశాన‌‌ని వివ‌‌రించారు.

కాజీపేట‌‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది అక్కడి ప్రజల క‌‌ల మాత్రమే కాద‌‌ని, యావ‌‌త్ తెలంగాణ స్వప్నమని చెప్పారు. అలాగే వికారాబాద్‌‌–కృష్ణా స్టేష‌‌న్ మ‌‌ధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్యయంతో నూత‌‌న రైలు మార్గం నిర్మించాల‌‌ని రైల్వే మంత్రిని కోరారు. ఈ మార్గం నిర్మిస్తే ద‌‌క్షిణ తెలంగాణ‌‌లో మారుమూల‌‌న వెనుక‌‌బ‌‌డి ఉన్న ప‌‌రిగి, కొడంగ‌‌ల్‌‌, చిట్లప‌‌ల్లె, టేక‌‌ల్ కోడ్‌‌, రావులపల్లి, మాటూరు, దౌల్తాబాద్‌‌, దామ‌‌ర‌‌గిద్ద, నారాయ‌‌ణ‌‌పేట్‌‌, మ‌‌క్తల్ అభివృద్ధి చెంద‌‌డంతోపాటు తాండూర్ స‌‌మీపంలోని సిమెంట్ క్లస్టర్‌‌, ఇత‌‌ర ప‌‌రిశ్రమ‌‌ల డెవలప్​మెంట్​కు అవ‌‌కాశం ఉంటుంద‌‌ని చెప్పారు. ఈ  మార్గంతో వికారాబాద్ జంక్షన్​ నుంచి కృష్ణా స్టేష‌‌న్ల మ‌‌ధ్య 70 కిలోమీట‌‌ర్ల దూరం త‌‌గ్గుతుంద‌‌ని వివరించారు. క‌‌ల్వకుర్తి–మాచ‌‌ర్ల మ‌‌ధ్య నూత‌‌న రైలు మార్గం మంజూరు చేయాల‌‌ని సీఎం కోరారు.

క‌‌ల్వకుర్తి నుంచి వంగూరు–కందుకూరు–దేవ‌‌ర‌‌కొండ‌‌–చ‌‌ల‌‌కుర్తి–తిరుమ‌‌ల‌‌గిరి మీదుగా మాచ‌‌ర్ల వ‌‌ర‌‌కు తాము ప్రతిపాదించే నూతన మార్గం ప్రతిపాదిత గ‌‌ద్వాల‌‌–డోర్నక‌‌ల్‌‌, ఇప్పటికే ఉన్న మాచ‌‌ర్ల లైన్లను అనుసంధానిస్తుంద‌‌ని సీఎం వివ‌‌రించారు. ఈ లైన్ నిర్మిస్తే సిమెంట్ ప‌‌రిశ్రమ‌‌ల‌‌తోపాటు అట‌‌వీ ఉత్పత్తుల విక్రయానికి ప్రయోజ‌‌నం కలుగుతుంద‌‌ని తెలిపారు. ఈ లైన్ తో సికింద్రాబాద్‌‌, గుంటూరు, డోన్ సెక్షన్ల మ‌‌ధ్య అనుసంధాన‌‌త క‌‌లిగి శ్రీ‌‌శైలం వెళ్లే భ‌‌క్తుల సులభ‌‌త‌‌ర ప్రయాణానికి అవ‌‌కాశం క‌‌ల్పిస్తుంద‌‌ని వివ‌‌రించారు. డోర్నక‌‌ల్‌‌–మిర్యాల‌‌గూడ (పాప‌‌ట‌‌ప‌‌ల్లి- జాన్ ప‌‌హాడ్‌‌), డోర్నక‌‌ల్‌‌-గ‌‌ద్వాల ప్రతిపాదిత రైలు మార్గాల‌‌ను పునఃప‌‌రిశీలించాల‌‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌‌కు సీఎం విజ్ఞప్తి చేశారు.