చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు రేవంత్. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు..ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో డ్రైపోర్ట్ ఏర్పాటు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. బందర్ పోర్ట్ కు రైల్వే లైన్ కు అనుమతి ఇవ్వాలన్నారు.
తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీకి కేరాఫ్ అడ్రస్ గా ఉందన్నారు రేవంత్ రెడ్డి. ఎలక్ట్రిక్ వేహికిల్ తయారీకి అనుమతి ఇవ్వాలన్నారు . రీజనల్ రింగ్ రోడ్డు 374కిలోమీటర్ల నిర్మాణం జరుగుతోందని.. రీజనల్ రైల్ అవసరమన్నారు. రైల్ రింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి కేంద్రం సహకరించాలన్నారు. వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కర్ణాటకకు రైల్వే లైన్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నార సీఎం రేవంత్.
ప్రధాని కోరుకుంటున్న 5 ట్రిలియన్ ఎకానమీ సకారం కావాలంటే అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరగాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటుందన్నారు. ట్రిలియన్ ఎకానమి కంట్రి బ్యూట్ చేసేందుకు తమకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వాలన్నారు రేవంత్ రెడ్డి.