సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. అసెంబ్లీలో ఈ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. సినిమా బెనిఫిట్ షోలు, సినిమా టిక్కెట్ల ధరలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమా బెనిఫిట్ షోలు ఉండవని, సినిమా ధరలు కూడా పెంచమని అసెంబ్లీలో ప్రకటించారు.
సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో చర్చకు లేవనెత్తిన సీఎం రేవంత్ రెడ్డి ..అనుమతి లేకున్నా సినీ హీరోలు అక్కడికి వచ్చారు.. వద్దని పోలీసులు వారించినా హీరో అక్కడికి వచ్చారు. సినీ హీరో రావడంతో ఒక్కసారిగా క్రౌడ్ పెరిగింది..వేలసంఖ్యలో అభిమానులు రావడంతో కంట్రోల్ చేయడం కష్టమైందన్నారు. తొక్కిసలాటలో రేవతి చనిపోయింది. ఆమె కొడుకు గత 20 రోజులుగా కోమాలో ఉన్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఇకపై సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు ఉండదు.. నేను అధికారంలో ఉన్నంత వరకు అనుమతి ఇవ్వను అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సినిమా వాళ్లు వ్యాపారం చేసుకోండి.. ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకోం అని హెచ్చరించారు.
ALSO READ | ధియేటర్ దగ్గర ఒకరు చనిపోతే.. అల్లు అర్జున్ తీరిగ్గా సినిమా చూస్తున్నాడు : సీఎం రేవంత్ రెడ్డి
ఈ కేసులో ప్రత్యక్ష, పరోక్ష బాధితులపై కేసులు పెట్టాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఘటన సమయంలో తల్లి చనిపోయి, కొడుకు చావు బతుకుల్లో ఉంటే హీరో అల్లు అర్జున్ పట్టించుకోకుండా సినిమా చూసుకుంటూ అక్కడే ఉన్నాడు..చివరికి డీసీపీ వచ్చి అరెస్ట్ చేస్తామని చెబితే అప్పుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. సినిమా థియేటర్ సిబ్బంది హీరో దగ్గరికి పోలీసులను వెళ్లనివ్వలేదు.. 11రోజుల తర్వాత హీరో దగ్గరికి పోలీసులు వెళితే దురుసుగా ప్రవర్తించారు.
తల్లి చనిపోయి బాలుడు బ్రెయిన్ డెడ్ అయితే సినిమా వాళ్లు ఎవరూ పరామర్శకువెళ్లలేదని అన్నారు. సినిమావాళ్లు ఇన్సెంటివ్స్ కావాలంటే తీసుకోండి.. ప్రివిలైజ్ కావాలంటే కుదరదు.. ఇకనుంచి టికెట్ ధరల పెంపు, బెనిఫఇట్ షోలకు అనుమతి ఉండదు.. నేను సీఎం గా ఉన్నంత వరకు అనుమతివ్వను.. నేను ఈ కుర్చిలో ఉన్నంత వరకు మీ ఆటలు సాగనివ్వను. సినిమా వాళ్లంటే పోనీ,. రాజకీయ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్టు నాపై విమర్శలు చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.