- పలు సూచనలు చేసిన సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు : స్కిల్ యూనివర్సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి ప్రాథమిక డిజైన్స్ ను సీఎం రేవంత్ రెడ్డి శనివారం సెక్రటేరియెట్లో పరిశీలించారు. ఈ సందర్భంగా డిజైన్స్ పై ఆర్కిటెక్ట్స్ కు సీఎం పలు సూచనలు చేశారు. సూచించిన మార్పులతో వీలైనంత త్వరగా పూర్తిస్థాయి డిజైన్స్ నమూనాను రూపొందించాలని ఆదేశించారు.
ALSO READ : మూసీ పొడవునా ఆక్రమణల తొలగింపు బాధ్యత హైడ్రాకు!
స్కిల్ యూనివర్సిటీ డిజైన్లను పరిశీలిస్తే అకడమిక్ బ్లాక్ జీ ప్లస్ 4, అడ్మినిస్ట్రేసన్ బ్లాక్ జీ ప్లస్4, బాయ్స్, గర్ల్స్ హాస్ట్సల్ వేర్వేరుగా జీ ప్లస్10, డైనింగ్ బ్లాక్ జీ ప్లస్ 3లా.. ఇతరత్రా అన్నింటిని డిజైన్లలో రూపొందించారు. వీటిలో ఇంకిన్ని మార్పులు చేస్తున్నారు.