మన చదువులు మారాలి ..స్కిల్స్ పెంపొందించేలా విద్యావిధానం ఉండాలి : సీఎం రేవంత్

మన చదువులు మారాలి ..స్కిల్స్ పెంపొందించేలా విద్యావిధానం ఉండాలి  : సీఎం రేవంత్
  • రూట్‌‌ మ్యాప్ రెడీ చేయండి.. విద్యా కమిషన్‌‌కు సీఎం రేవంత్ ఆదేశం 
  • పిల్లలకు ప్రాథమిక దశ నుంచే బలమైన పునాదులు వేయాలి 
  • భాష‌‌, విష‌‌య ప‌‌రిజ్ఞానం రెండూ ముఖ్యమే 
  • సమగ్ర విద్యావిధానం రూపొందించండి
  • వివిధ సంఘాలు, విద్యావేత్తలు, 
  • మేధావులతో చర్చించాలని సూచన 
  • విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సీఎం సమీక్ష 
  • ప్రాధాన్యం లేని కోర్సులు బంద్ పెట్టండి 
  • డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు ప్రారంభించండి
  • వీసీలతో రివ్యూ మీటింగ్‌‌లో సీఎం ఆదేశం 

హైద‌‌రాబాద్‌‌, వెలుగు:  మారుతున్న అవసరాలకు తగ్గట్టు మన చదువులను మార్చాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల్లో జీవ‌‌న నైపుణ్యాలు పెంపొందించేలా విద్యావిధానం ఉండాలని, ఇందుకోసం రూట్‌‌మ్యాప్​ రూపొందించాలని విద్యా కమిషన్‌‌ను ఆదేశించారు. ‘ప్రస్తుత విద్యా వ్యవ‌‌స్థలో లోపాలు.. తీసుకురావ‌‌ల్సిన సంస్కర‌‌ణ‌‌లు’ అనే అంశంపై విద్యా కమిషన్ ​సభ్యులు, విద్యాశాఖ అధికారులతో శుక్రవారం హైదరాబాద్‌‌లోని కమాండ్​ కంట్రోల్​ సెంటర్‌‌‌‌లో సీఎం రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడుతూ..- విద్య అంటే నిత్య జీవితంలో ఉపయోగపడే స్కిల్స్ నేర్పించేదిగా ఉండాలన్నారు. ‘‘విద్యార్థులకు భాషతో పాటు విషయ పరిజ్ఞానంపైనా మంచి పట్టురావాలి. లాంగ్వేజ్, సబ్జెక్ట్​ రెండూ ముఖ్యమే. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా సర్కార్ సిద్ధంగా ఉంది. సమగ్ర విద్యావిధానం కోసం రూట్‌‌మ్యాప్​ రూపొందించండి” అని అధికారులను ఆదేశించారు. 

‘ఈ సమగ్ర విద్యావిధానం కేవలం పేపర్‌‌‌‌పై మాత్రమే కనిపిస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అనుకూలంగా ఉండాలి. ప్రస్తుత ఎడ్యుకేషన్​సిస్టమ్‌‌లో ఎలాంటి లోపాలు ఉన్నాయి? మనం ఎలాంటి మార్పులు తేవాలనేది ఆలోచించండి. అంగ‌‌న్‌‌వాడీలు, ప్రాథ‌‌మిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పుల‌‌పై స‌‌మాజంలోని వివిధ సంఘాలు, ప్రముఖుల‌‌తో చ‌‌ర్చించండి” అని సూచించారు.  చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ అందిస్తేనే పిల్లల ఫౌండేషన్ బలంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

దాని వల్ల ఉన్నత చదువుల్లో వాళ్లు సక్సెస్ అవుతారని చెప్పారు. ‘‘మన దగ్గర ఉన్న రిసోర్సెస్‌‌‌‌‌‌‌‌ను బాగా వాడుకోవడం ద్వారా విద్యలో రాష్ట్రం నెంబర్ వన్‌‌‌‌‌‌‌‌గా నిలిచేలా మీ సలహాలు, సూచనలు ఉండాలి’ అని అధికారులకు సూచించారు. ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం, టీచర్ల రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్, అమ్మ ఆదర్శ కమిటీలు, బుక్స్, యూనిఫామ్‌‌‌‌‌‌‌‌ల డిస్ట్రిబ్యూషన్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు, స్కిల్ యూనివర్సిటీల నిర్మాణం తదితర అంశాలను వివరించారు. కాగా, వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా ఉందో పవర్ పాయింట్‌‌‌‌‌‌‌‌ ప్రజెంటేషన్​ద్వారా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వివరించారు. 

1960 నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులు పిల్లల్లో క్రియేటివిటీ, ఆలోచనలను ఎలా దెబ్బతీశాయో డాక్టర్ జయప్రకాశ్ నారాయణ చెప్పారు. ఎగ్జామ్ సిస్టమ్, స్కూళ్లలో ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్షన్, లైఫ్ స్కిల్స్ మెరుగు చేయడానికి ఏం చేయాలో ఆయన సలహా ఇచ్చారు. సమావేశంలో  సీఎం స‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌హాదారు వేం న‌‌‌‌‌‌‌‌రేంద‌‌‌‌‌‌‌‌ర్ రెడ్డి,  ప్రభుత్వ సలహాదారులు కేశ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌రావు,  శ్రీ‌‌‌‌‌‌‌‌నివాస‌‌‌‌‌‌‌‌రాజు, సీఎం కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి మాణిక్ రాజ్‌‌‌‌‌‌‌‌, సీఎం ఓఎస్డీ వేముల శ్రీ‌‌‌‌‌‌‌‌నివాసులు, విద్యా శాఖ కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి యోగితారాణా, ప్రాథ‌‌‌‌‌‌‌‌మిక విద్యా శాఖ డైరెక్టర్ న‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌సింహారెడ్డి, విద్యా క‌‌‌‌‌‌‌‌మిష‌‌‌‌‌‌‌‌న్ స‌‌‌‌‌‌‌‌భ్యులు ప్రొఫెస‌‌‌‌‌‌‌‌ర్ పి.ఎల్‌‌‌‌‌‌‌‌.విశ్వేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు, చార‌‌‌‌‌‌‌‌కొండ వెంక‌‌‌‌‌‌‌‌టేష్‌‌‌‌‌‌‌‌, కె.జ్యోత్స్నశివారెడ్డి, ప‌‌‌‌‌‌‌‌లు ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.  

వర్సిటీలకు ఎన్ని నిధులైనా ఇస్తం.. 

యూనివర్సిటీలన్నీ విద్యార్థుల కేంద్రంగా ప‌‌‌‌‌‌‌‌ని చేయాల‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భ‌‌‌‌‌‌‌‌విష్యత్‌‌‌‌‌‌‌‌ను తీర్చిదిద్దే కోర్సులు ఉండాల‌‌‌‌‌‌‌‌ని, మార్కెట్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ ఉన్న కోర్సుల బోధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌‌‌‌‌‌‌‌ని సూచించారు. శుక్రవారం కమాండ్​ కంట్రోల్​ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూనివర్సిటీల వైస్ చాన్స్‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ర్లతో సీఎం రేవంత్ రెడ్డి స‌‌‌‌‌‌‌‌మీక్ష నిర్వహించారు. ప్రాధాన్యం లేని పాత కోర్సులను రద్దు చేసి, నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. ఆయా కోర్సుల‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ప్రొఫెస‌‌‌‌‌‌‌‌ర్లకు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు అప్పగించాల‌‌‌‌‌‌‌‌ని ఆదేశించారు. 

కొంద‌‌‌‌‌‌‌‌రు ప్రొఫెస‌‌‌‌‌‌‌‌ర్లకు రిహాబిలిటేష‌‌‌‌‌‌‌‌న్ సెంట‌‌‌‌‌‌‌‌ర్లుగా యూనివ‌‌‌‌‌‌‌‌ర్సిటీల‌‌‌‌‌‌‌‌ను మార్చొద్దని స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం ప్రభుత్వ యూనివర్సిటీలకు ఆర్థిక స్తోమ‌‌‌‌‌‌‌‌త లేని గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఎక్కువగా వ‌‌‌‌‌‌‌‌స్తున్నారు. వారికి స‌‌‌‌‌‌‌‌రైన భ‌‌‌‌‌‌‌‌విష్యత్ క‌‌‌‌‌‌‌‌ల్పించేలా బోధ‌‌‌‌‌‌‌‌న ఉండాలి. ఆర్థిక స్తోమ‌‌‌‌‌‌‌‌త ఉన్న కుటుంబాల నుంచి వ‌‌‌‌‌‌‌‌చ్చిన వారు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో డిమాండ్ ఉన్న కోర్సుల‌‌‌‌‌‌‌‌ను ఎంచుకొని ప్రైవేటు యూనివర్సిటీల వైపు వెళ్లిపోతున్నారు. వారితో ఎదుర‌‌‌‌‌‌‌‌య్యే పోటీని ప్రభుత్వ వర్సిటీల విద్యార్థులు ఎదుర్కోవాలంటే డిమాండ్ ఉన్న కోర్సుల‌‌‌‌‌‌‌‌నే మ‌‌‌‌‌‌‌‌నం బోధించాల్సి ఉంటుంది” అని అన్నారు. వర్సిటీల్లోని సమస్యలను వీసీలు వివరించగా.. యూనివ‌‌‌‌‌‌‌‌ర్సిటీలకు అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మైన నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 

వీసీలంతా త‌‌‌‌‌‌‌‌మ ఉమ్మడి స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యలు, అలాగే వ‌‌‌‌‌‌‌‌ర్సిటీల వారీగా స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యల‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర ప్రభుత్వ స‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌హాదారు కె.కేశ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌రావుతో స‌‌‌‌‌‌‌‌మావేశం కావాల‌‌‌‌‌‌‌‌ని సూచించారు. అనంత‌‌‌‌‌‌‌‌రం యూనివ‌‌‌‌‌‌‌‌ర్సిటీల వారీగా తీసుకోవాల్సిన చ‌‌‌‌‌‌‌‌ర్యల‌‌‌‌‌‌‌‌పై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ర్పించాల‌‌‌‌‌‌‌‌ని ఆదేశించారు. స‌‌‌‌‌‌‌‌మావేశంలో ఉన్నత విద్యామండ‌‌‌‌‌‌‌‌లి చైర్మన్ బాల‌‌‌‌‌‌‌‌కిష్టారెడ్డి, యూనివర్సిటీల వైస్ చాన్స్‌‌‌‌‌‌‌‌లర్లు ప్రొఫెస‌‌‌‌‌‌‌‌ర్లు కుమార్ మొలుగారం, కె.ప‌‌‌‌‌‌‌‌త్రాప్ రెడ్డి, డాక్టర్ టి.యాద‌‌‌‌‌‌‌‌గిరిరావు, ఖాజా అల్తాఫ్ హుస్సేన్‌‌‌‌‌‌‌‌, జి.ఎన్‌‌‌‌‌‌‌‌.శ్రీ‌‌‌‌‌‌‌‌నివాస్‌‌‌‌‌‌‌‌, ఉమేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌, సూర్య ధ‌‌‌‌‌‌‌‌నంజ‌‌‌‌‌‌‌‌య్‌‌‌‌‌‌‌‌, కిష‌‌‌‌‌‌‌‌న్ కుమార్ రెడ్డి, టి.గంగాధ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌, ఎ.గోవ‌‌‌‌‌‌‌‌ర్ధన్‌‌‌‌‌‌‌‌, వి.నిత్యానంద‌‌‌‌‌‌‌‌రావు, ఘంటా చ‌‌‌‌‌‌‌‌క్రపాణి త‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌రులు పాల్గొన్నారు.

బాబూ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్జీవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ రామ్ స్ఫూర్తితో ప్రజాపాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న: సీఎం

స్వాతంత్య్ర స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యోధుడు, మాజీ ఉప ప్రధాన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మంత్రి డా. బాబూ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్జీవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ రామ్ జీవితం స్ఫూర్తిదాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, దేశానికి ఆయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చేసిన సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్మర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణీయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.  డా.బాబూ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్జీవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ రామ్ 118వ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంతిని పుర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కరించుకొని ఆయన చేసిన సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం స్మరించుకున్నారు. పేదరికంలో జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్మించిన బాబూ జగ్జీవన్​రామ్​అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని గుర్తుచేసుకున్నారు. 

జాతీయోద్యమంలో పాల్గొన్న బాబూజీ తొలి ప్రధాని జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్ నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా సేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అందించార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని.. కార్మిక సంక్షేమానికి పాటుప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. అంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రానిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నం, కుల వివ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ష నిర్మూల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోరాడార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళితుల అభ్యున్నతికి కృషిచేశారని చెప్పారు. బాబూ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్జీవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ రామ్  స్ఫూర్తితోనే ప్రజా పాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న కొన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాగిస్తున్నామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చెప్పారు.ఆయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న ఆశ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాలకు అనుగుణంగానే  ప్రజా ప్రభుత్వం కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణను అమలు చేసిందని సీఎం పేర్కొన్నారు.