వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ పై సీఎం రివ్యూ

వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ పై సీఎం రివ్యూ

కొడంగల్, వెలుగు: వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్ పై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సోమవారం రివ్యూ చేశారు. రూ.3500 కోట్లతో 145కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్న రైల్వే లైన్ రూట్ మ్యాప్ పై పలు సూచనలు ఇచ్చారు. 

వికారాబాద్–-కృష్ణారైల్వే లైన్ రూట్ మ్యాప్ ను అసెంబ్లీలో సీఎం రేవంత్ కు రైల్వే శాఖ చీఫ్​ ఇంజినీర్ సుబ్రహ్మణ్యన్ వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, పర్ణికా రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.