ఆర్మూర్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ లో బుధవారం జరిగే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో, కార్నర్ మీటింగ్కు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మామిడిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు జరిగే రోడ్ షోలో సీఎం పాల్గొంటారని అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగే కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడతారని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటి పత్రి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆర్మూర్ లో జరిగే సీఎం రోడ్ షో, కార్నర్ మీటింగ్ కు భారీ ఎత్తున హాజరు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సీఎం ప్రోగ్రాంకు హాజరవుతున్నట్లు తెలిపారు.