కారేపల్లి, వెలుగు: వరదలో కారు కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్ట్నూనావత్ అశ్విని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు వెళ్లి అశ్వినీ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా అశ్విని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అదే విధంగా పరిహారం కూడా అందజేస్తామని తెలిపారు. కాగా, అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ కారులో హైదరాబాద్ వెళ్తుండగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద వరదలో కారు కొట్టుకుపోయి వాళ్లిద్దరూ చనిపోయారు.