పాలమూరు జిల్లా కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తా: సీఎం రేవంత్

పాలమూరు జిల్లా కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తా: సీఎం రేవంత్

ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చుచేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో మెడికల్ కాలేజీ,హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రేవంత్.

ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్..70 ఏండ్ల తర్వాత మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తికి సీఎం అయ్యే అవకాశం వచ్చింది. జిల్లా అభివృద్ది కోసం చేయాల్సినవన్నీ చేస్తా. నా జిల్లా అభివృద్ది కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తా. జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా.  ఇక్కడి మెడికల్ కాలేజీకి చిట్టెం నర్సిరెడ్డి పేరు పెట్టాలని అదేశిస్తున్నా అని రేవంత్ అన్నారు. 

ఇక్కడి ఎమ్మెల్యే  పర్ణికా ఓ డాక్టర్ కావడం ఇక్కడి మెడికోల అదృష్టమన్నారు సీఎం రేవంత్. మీ అవసరాలు ఎంఎల్ఏ కు చెప్పాల్సిన పనిలేదు. ఈ వృత్తి ఓ మానవీయ దృక్పథంతో చేయాల్సిన పని.  ఇక్కడి పారా మెడికల్ సిబ్బందికి మిడిల్ ఈస్ట్ లో చాలా డిమాండ్ ఉంది.. ఆ కోవలో కూడా మీ ఉపాధి కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది. జీవితంలో ఇది చాలా కీలక సమయం.. మీరు వినియోగించుకుని చదువులో రాణించాలి. పేదలకు నాణ్యమైన వైద్యంఅందాలి. మారుమూల గ్రామాల పేదలకు వైద్య సేవలందిస్తాం.  టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్  లేకుండా గొప్ప డాక్టర్లు కాలేరు.  అద్దాల మేడలు అభివృద్ది కాదని అంబేద్కర్ చెప్పారు. మెడికల్ కాలేజీలకు నిధుల లోటు రానివ్వం అని రేవంత్ అన్నారు.