ఢిల్లీ పోలీసులు వచ్చినా..సుల్తానులు వచ్చినా ఎవ్వరికీ భయపడబోనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూపాలపల్లి జిల్లా రేగొండ సభలో మాట్లాడిన ఆయన.. గుజరాత్ పెత్తననాకి ? తెలంగాణ పౌరుషానికి మధ్య పోటీ జరుగుతున్న పోటీ అని చెప్పారు. కేసీఆర్ ఆత్మ అమిత్ షాను ఆవహించిందన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి కేసీఆర్ జైలుకు పంపించారన్న రేవంత్.. ప్రశ్నిస్తే ఢిల్లీ సుల్తానులు వేధిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ నుంచి గాంధీ భవన్ కు పోలీసులను పంపించారని.. ఇపుడు బీజేపీ నేతలు కూడా అదే రూట్లో పోతున్నారని మండిపడ్డారు. జనం మద్దతుంటే.. ఢిల్లీ ఐనా, గుజరాతైనా బండకేసి కొట్టుడేనని అన్నారు రేవంత్
బీజేపీ ఎన్నికలకు మందు చంద్రబాబుతో..ఆ తర్వాత కేసీఆర్ తో పొత్తుపెట్టుకుంటుందని చెప్పారు రేవంత్. కేసీఆర్ సచ్చిన పాములాంటోడు..కానీ పడగ మీద కొట్టకుండా తోక మీద కొట్టాం..అందుకే మళ్లీ మెళ్లమెళ్లగా లేస్తుండు. ఖమ్మం సభలో బీఆర్ఎస్ కు 12 సీట్లిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు కేసీఆర్. అంటే బీజేపీతో ముందస్తు పొత్తు ఖరారయ్యింది. బీజేపీ, బీఆర్ఎస్ వేరువేరు కాదు. బీఆర్ఎస్ కు ఓటేస్తే మురిగిపోతుంది. బీజేపీకి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. వరంగల్ కు ఎయిర్ పోర్టు కాకుండా మోదీ అడ్డుకున్నారు . వరంగల్ ను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు రేవంత్.