కేసీఆర్ డైనింగ్ టేబుల్ పైనే కృష్ణా నీళ్ల దోపిడి జరిగింది: సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్: కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బీఆర్ఎస్ పాలకులని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఇదే విషయాన్ని నామా నాగేశ్వర రావు చెప్పారు..నిజంగా ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు రేవంత్రెడ్డి. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందే బీఆర్ఎస్ సర్కార్ అని ఆరోపించారు.

ALSO READ :- ఫ్రీ బస్సు స్కీం వల్ల దేవాదాయ ఆదాయం రెట్టింపైంది -రేవంత్

కాళేశ్వరం అవినీతి బయటపడటంతో KRMB కి అప్పగించారంటూ తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ మంత్రి రోజా ఇంట్లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని బీఆర్ఎస్ నేతలు హామీ ఇచ్చారు.. ఇప్పుడు రాయల సీమ జిల్లాలకు నీళ్ళు ఎట్లా పోతున్నాయో వారే సమాధానం చెప్పాలన్నారు.