కులగణనకు చట్టబద్ధత .. బీసీలకు సముచిత స్థానం కల్పించడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన చేశామని చెప్పారు. 2024 ఫిబ్రవరిలో కులగణన చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కులగణణ చేసి చూపించామన్నారు. సర్వే ఆశామాషీగా చేయలేదని.. కర్ణాటక, బీహార్ లో సర్వేలను అధ్యయనం చేసి సర్వే చేశామన్నారు.
సర్వేపై కొందరు మేదావుల సలహాలు తీసుకున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 96.9 శాతం మంది సర్వేలో పాల్గొన్నారు .. సర్వేలో కోటి 12 లక్షల కుటుంబాలు పాల్గొన్నాయి. గ్రామాల్లో 66 లక్షల కుటుంబాలకు పైగా పాల్గొన్నాయి. 56 రోజుల్లో సర్వే పూర్తయింది. డేటా ఎంట్రీకి36 రోజులు పట్టింది. 75 అంశాల ప్రాతిపదికన సర్వే చేశాం. తెలంగాణలో 3.54 కోట్ల జనాభా ఉంది. రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33 శాతం ఉన్నారు. బీసీలు 46 .25 శాతం. ముస్లీం బీసీలు 10.08 శాతం. మొత్తం ఓసీలు 15.79 శాతం ఇందులో ముస్లీం ఓసీలు 2.8 శాతం ఉన్నారు. ఎస్సీలు 17.43 శాతం. ఎస్టీలు 10.45. 2011 తర్వాత కులగణన చేసింది మేమే.
ALSO READ | కుల గణన ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి
ఉమ్మడి 10 జిల్లాల్లో ప్రతీగ్రామంలో సర్వే జరిగింది. ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే జరిగింది. 150 ఇళ్లకు ఒక క్లస్టర్ గా స్టిక్కరింగ్ చేసి సర్వే చేశాం.
సర్వే కోసం సిబ్బందికి క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇచ్చాం. కులగణన సర్వేతో దేశానికే ఆదర్శంగా నిలిచాం. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత స్థానం కల్పిస్తాం.
ఈ లెక్కలు బీసీ అభ్యున్నతికి ఉపయోగపడతాయి. సామాజినికి ఎక్స్ రే లాంటిది కులగణన సర్వే. ఈ దేశంలో బలహీన వర్గాల లెక్కలేదు. జనగణనలో కులగణన లెక్కలు తీయాలి అని రేవంత్ అన్నారు.