
కేసీఆర్ ,కేటీఆర్, హరీశ్ రావు జనాభా లెక్కల్లోనే లేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇన్ని అవకాశాలు ఇచ్చిన.. వాళ్లు కులగణన సర్వేలో పాల్గొనలేదన్నారు. కులగణన సర్వే లెక్క తప్పైతే ఎట్ల తప్పో వచ్చి చూపించాలన్నారు రేవంత్. ప్రతిపక్షాలు మొండిగా..తొండిగా వాదిస్తున్నారని విమర్శించారు రేవంత్.
కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక అని అందుకు సర్వే వివరాలు బయటపెట్టలేదన్నారు. కేసీఆర్ చెప్పిన లెక్కల ప్రకారం బీసీలు తగ్గారు..ఓసీలు పెరిగారని చెప్పారు. కాకి లెక్కలు చెప్పి జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు రేవంత్. కులగణన సర్వే తెలంగాణ దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ నిలుస్తోందన్నారు . దేశమంతా కులగణన చేయాల్సి వస్తుందని బీజేపీ భయపడుతోందన్నారు.
Also Read :- కులగణన నూటికి నూరు శాతం పక్కా
కులగణన నూటికి నూరు శాతం పక్కా అని సీఎం రేవంత్ అన్నారు. కులగణన చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీసీ సంఘాలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. కులగణనలో తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్ గా నిలువబోతుందన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దన్నారు. సర్వే తప్పు అయితే..ఎట్ల తప్పో చూపించాలని బీజేపీ,బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు రేవంత్. కుట్రలో భాగంగానే బీజేపీ,బీఆర్ఎస్ కులగణన సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్. కులగణన లెక్కలు తప్పు కాదని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కులాల వారీగా సమావేశాలు నిర్వహించి కులగణన లెక్క పక్కా అని మార్చి 10 లోగా తీర్మానం చేయాలని సూచించారు రేవంత్ .