రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 15 వేల ఉద్యోగాలను 15 రోజుల్లో భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బిల్లా రంగాలు ఎంతమంది అడ్డం వచ్చినా.. ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.
బీఆర్ ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదన్నారు సీఎం. ఎంతసేపు తన కొడుకు, బిడ్డల పదవుల గురించి ఆలోచించిన కేసీఆర్ .. నిరుద్యోగుల గురించి ఏనాడు ఆలోచించలేదని విమర్శించారు రేవంత్ రెడ్డి. పదేళ్లుగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను నియమించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 7వేల మందికి స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామక ప్రతాలు అందజేశామన్నారు.