వరంగల్ లో 5 లక్షల మందితో సభ :సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ లో 5 లక్షల మందితో సభ :సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలాశాసనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  రైతురుణమాఫీ సందర్భంగా వరంగల్ లో కృతజ్ఞత సభ నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  వరంగల్ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు. సభను విజయవంతం చేయాలని రైతులను కోరారు రేవంత్ 

 సీఎం రేవంత్ కామెంట్స్

  • జూలై 20న  ఢిల్లీ వెళ్తా.. రాహుల్ గాంధీని  కలుస్తా
  • వరంగల్ లో నెలాఖరులోగా 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ 
  • సభకు రాహుల్ ను ఆహ్వానిస్తాం
  • దేశానికే ఆదర్శంగా నిలబడే  అవకాశం వచ్చింది.
  • పార్టీకి నష్టం వచ్చినా  సోనియా ఆనాడు మాట ఇచ్చారు
  • 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను  ఆకాంక్షను నెరవేర్చారు
  • గత ప్రభుత్వం రైతులను నిండా ముంచింది
  • రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారు
  • గత ప్రభుత్వం తొలి ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు చెల్లించారు
  • గత ప్రభుత్వం రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదు
  •  కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనం అని మరోసారి నిరూపించింది
  •  ఎన్ని ఇబ్బందలు వచ్చినా.. సవాళ్లు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నాం
  • రైతుల రుణమాఫీ చేసినాం
  • 6098 కోట్లు రైతుల ఖాతాల్లో ఇవాళ జమ చేశాం
  • డిసెంబర్ 9,2023కు కటాఫ్ పెట్టుకున్నాం
  • రుణమాఫీకి పాస్ పుస్తకం మాత్రమే ప్రమాణికం..రేషన్ కార్దు, ఇతర కార్డులు కాదు
  •  నా 16 ఏండ్ల రాజకీయ జీవితంలో  మరిచిపోని రోజు
  • ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తాం
  •  కాంగ్రెస్ మాటి ఇస్తే ..మడమ తిప్పదు
  •  సోనియా గాంధీ  మటిస్తే నిలబెట్టుకుంటారు
  •  కేసీఆర్ రాష్ట్రానికి ఇచ్చింది 7లక్షల కోట్ల అప్పు
  • దేశానికి తెలంగాణ రాష్ట్రం మోడల్
  • కొంతమంది రుణమాఫీపై అసత్యాలు,అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు
  •  మేం ఎవర్నీ రాజీనామా చేయమని అడగం.. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదన్న విషయం తెలుసుకోవాలి.
  • తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ కు నీళ్లిస్తాం