ఆదివాసీల కోసం స్టడీ సర్కిల్.. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్

ఆదివాసీల కోసం ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేస్టున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదివాసీ సంఘాలు,ప్రజాప్రతినిధులతో రేవంత్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గోండు భాషలో ప్రాథమిక విద్య అందించే విషయంపై స్టడీచేయాలని అధికారులను ఆదేశించారు. 

 ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకు న్న తర్వాత తొలిసభను ఇంద్రవెల్లిలోనే నిర్వహించామని చెప్పారు. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని స్మృ తివనంగా మార్చాలని నిర్ణయించామని అన్నారు. ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని అన్నారు.

 కొమురం భీమ్ వర్ధంతి, జయం తులను అధికారిక ఉత్సవంగా నిర్వహిం చాలని అధికారులను సీఎం అధికారులను ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాల్లో రాయి సెంటర్ల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఉద్యమ సమయంలో ఆదివాసీలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్టు సీఎం చెప్పారు.

 ఇందిర జల ప్రభ ద్వారా ఆదివాసీల భూముల సాగులోకి తెచ్చేందుకు ఇందిర జల ప్రభ ద్వారా మరిన్ని బోర్లు వేయించనున్నట్టు చెప్పారు. ఆదివాసీ లు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. విదేశాల్లో చదు వుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించిపెండింగ్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ను క్లియర్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించా రు. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆదివాసీ రైతులు వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసు కుంటామని చెప్పారు.