అబద్ధాలకు బీజేపీ యూనివర్శిటీ .. మోదీ వీసీ.. అమిత్ షా రిజిస్ట్రార్

అబద్ధాలకు బీజేపీ యూనివర్శిటీ .. మోదీ వీసీ.. అమిత్ షా  రిజిస్ట్రార్

ప్రధాని నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ అని అందుకే ఆయనకు బీసీలపై ప్రేమ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అబద్ధాలు చెప్పడంలో బీజేపీ పెద్ద యూనివర్సిటీ అయితే  దానికి వీసీ మోదీ, రిజిస్ట్రార్ అమిత్ షా అని చెప్పారు. రిజర్వేషన్లు తొలగించాలని ఆర్ఎస్ఎస్ వందేళ్ల క్రితమే టార్గెట్ పెట్టుకుందన్నారు.  రాజ్యాంగాన్ని సవరించాలి.. రిజర్వేషన్లు రద్దు చేయాలనేదే బీజేపీ లక్ష్యమన్నారు.

ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ముఖ్యమంత్రిపై కేసులు పెడుతారా? అని ప్రశ్నించారు రేవంత్.  తనను  ఎన్నికల ప్రచారం చేయకుండా బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.  అమిత్ షా, మోదీ తమ పోలీసులతో తనను  బెదిరించడం అసాధ్యమన్నారు. తమ  తరపున మహిళా అడ్వకేట్ వెళ్తే ఆమెతో డిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలిపారు.

రాజ్యాంగం మార్చడానికే వచ్చామని కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డే ప్రకటించారని చెప్పారు రేవంత్.  లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ రిజర్వేషన్లు అభివృద్ధికి ఉపయోగపడుతాయా అని మాట్లాడారని తెలిపారు.  ఎన్నికలకు ఇబ్బంది అవుతుందనే తాను మాట్లాడే విషయాలను పక్కదోవ పట్టిస్తున్నారని చెప్పారు రేవంత్.  నిజాలు మాట్లాడుతున్నందుకే తనపై డిల్లీలో అక్రమ కేసులు పెట్టారని అన్నారు. తాను మాట్లాడేది తన కోసమో, తన పార్టీ కోసమో కాదన్నారు.  తాను మాట్లాడే విషయాలపై మోదీ, అమిత్ షా వాళ్ళ పార్టీ విధానాన్ని చెప్పడానికి ఇబ్బందేంటని ప్రశ్నించారు.