30 వేల సర్కారు బడులకు ఫ్రీ కరెంటు

30 వేల సర్కారు బడులకు ఫ్రీ కరెంటు
  • టీచర్ల చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్
  • మన బడులను బాగుపర్చుకుందాం
  • సెల్ప్ హెల్ప్ గ్రూప్ లకు పారిశుధ్య నిర్వహణ బాధ్యత
  • పాఠశాలల్లో టాయిలెట్లు లేక పోవడం బాధాకరం
  • బడుల్లో సమస్యలన్నింటినీ పరిష్కరిస్తం 
  • సర్కారు బడుల్లో ఎన్  రోల్ మెంట్స్  పెంచాలి
  • పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలి
  • టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ టీచర్ల చేతుల్లోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 30 వేల పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం చెప్పారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 30 వేల సర్కారు బడులకు ఉచిత కరెంటును అందించనున్నట్టు సీఎం చెప్పారు.

సీఎం మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలలు 30 వేల లో 26 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులన్నరు. ప్రైవేటులో 10 వేలస్కూలు 33 లక్షల మంది అక్కడ చదువుతుండ్రు.. ప్రైవేటు పాఠశాలల్లో మీకంటే ఎక్కువ చదువుకున్నోళ్లు ఉన్నరా..? ఇంటర్ పాసై, డిగ్రీ ఫెయిలైన వారే ఉన్నరు..మన స్కూళ్లలో ఎన్రోల్ మెంట్ తగ్గడానికి ఎక్కడో లోపం ఉంది.. అది మాది కూడా కావచ్చు..కారణం ఏదైనా కావచ్చు..’ అని సీఎం అన్నారు. 

డబిడ్డలు, మహిళా టీచర్లు టాయ్ లెట్లు లేక ఇబ్బందులు పడుతుండవచ్చని, అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అమ్మ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు అందించనున్నట్టు తెలిపారు. మన పాఠశాలలను బాగు చేసుకుందామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి దేశ భవిష్యత్ ను నిర్మించాలని ఆకాంక్షించారు. ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని, ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. 

0 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చామని చెప్పారు. 35 వేల మందికి బదిలీలు చేశామన్నారు. తాను కొండారెడ్డి పల్లి ప్రైమరీ స్కూల్లో, తాండ్ర హైస్కూల్ లో , వనపర్తి హైస్కూల్లో చదువుకున్నానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికే ఈ బడ్జెట్ లో 21 వేల కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పారు. విద్యార్థులకు మొదటి రోజునే యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు అందిచామని అన్నారు. 

ళ్లోసారి తనను ముఖ్యమంత్రిగా చూడాలంటే టీచర్లంతా బాగా పనిచేయాలని, విద్యావంతుల తెలంగాణను తీర్చిదిద్దాలని చెప్పారు. దొరలగడీల్లో తెలంగాణ బందీ కావద్దంటే మీరు పేదలకు చదువు చెప్పినప్పుడే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంటే టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు.

కార్యక్రమంలో మంత్రి  పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, సీఎస్ శాంతి కుమారి, టీచర్ ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.