తెలంగాణలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ :సీఎం రేవంత్

తెలంగాణలోని ప్రతీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సంవత్సరంలోనే 100 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించబోతున్నామని చెప్పారు. ఒక్కో స్కూల్ కు 100 నుంచి 15 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని చెప్పారు. గురుకులాల పేరుతో గత ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు రేవంత్. 10 నుంచి15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్శిటీల్లో వీసీలను నియమిస్తామన్నారు.

  సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన 135 మంది  అభ్యర్థులకు సెక్రటేరియట్ లో  రాజీవ్ గాంధీ సివిల్ అభయ హస్తం చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు.  ఒక్కో విద్యార్థికి రూ. లక్ష చెక్కను అందజేశారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సివిల్స్ విద్యార్థులను అభినందించిన రేవంత్ రెడ్డి. తెలంగాణ యువత ఉన్నత స్థాయిలో రాణించాలని కోరారు. లక్ష పెద్ద విషయం కాకున్నా.. ప్రభుత్వం మీకోసం  ఉందనే  విశ్వాసం కల్పించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వం మీది ..మీకు అండగా ఉంటుందన్నారు రేవంత్.

ALSO READ | CMRF scam: సీఎంఆర్ఎఫ్ స్కాం..ట్రీట్ మెంట్ చేయకుండానే డబ్బులు కాజేసిన ఆస్పత్రులివే...

 నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు  ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రేవంత్.  నిరుద్యోగులు,యువత ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని సూచించారు.  గత పదేళ్లలో  పరీక్షల కోసం నిరుద్యోగులు,దీక్షలు ధర్నాలు చేశారని..తాము నియమాకాలు చేపడుతుంటే వాయిదా వేయాలంటున్నారన్నారు.  ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందుతున్నాయన్నారు. పరీక్షలు పెట్టొద్దని ధర్నాలు చేయడం 
సరికాదన్నారు రేవంత్.  

ALSO READ | కేటీఆర్ ఓ పెద్ద తుగ్లక్.. ఆధారాలు లేకుండా ఫాంహౌస్ పై ఆరోపణలు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఉద్యోగ అవకాశాల కోసమే తెలంగాణ ఉద్యమం చేశామన్నారు రేవంత్.  రాష్ట్ర యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు.  యువతకు ఉపాధి అకాశాలు కల్పనే లక్షంగా తెలంగాణ ప్రభుత్వ పనిచేస్తుందన్నారు. అందులో భాగమే  రాజీవ్ సివిల్స్  అభయ హస్తమన్నారు. 
 రాష్ట్రంలో  యువతకు ప్రధానమైనది నిరుద్యోగ సమ్య అని అన్నారు. 

విద్యార్థులు క్రీడల్లో రాణించాలనే యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు రేవంత్. స్కిల్ వర్శిటీకి ఆనంద్  మహింద్రాను ఛైర్మన్ గా నియమించామన్నారు.   ఉన్నత స్థాయిలో తెలంగాణ యువత  రాణించాలన్నారు.  ముచ్చెర్లలో వర్శిటీ ఏర్పాటుకు ,భూమి, నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలోనే  యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ కూడా ఏర్పాటు చేస్తామన్నారు.  విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు.పరిశ్రమలు ,విద్యార్థులకు మధ్య గ్యాప్  వస్తుందని.. అందుకే స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో విద్య సర్టిఫికెట్ లకే పరిమితమవుతోందన్నారు రేవంత్.