కేసీఆర్.. పెద్దరికం నిలుపుకో..అసెంబ్లీకి వచ్చి సలహాలివ్వు

 

  • ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వు.. తప్పులుంటే ప్రశ్నించు
  •  అందరం కలిసి మంచి సంప్రదాయం నెలకొల్పుదాం: సీఎం రేవంత్​
  •  ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే
  • రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కలిసి పనిచేద్దాం
  • తెల్వక చిల్లర పనులు చేస్తున్న కేటీఆర్​, హరీశ్​ను కూసోబెట్టి బుద్ధి చెప్పండి
  • ఈ నెల ​9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నం
  • భేషజాలకు పోకుండా కార్యక్రమానికి రావాలని కేసీఆర్​కు సూచన
  • ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం యాప్​ ప్రారంభం
  • నియోజ‌‌క‌‌వ‌‌ర్గానికి 3,500 చొప్పున ఈ ఏడాది 4.50 ల‌‌క్షల ఇండ్లు 

 
హైదరాబాద్​, వెలుగు: ముఖ్యమంత్రికి ఎంత ప్రాధాన్యం ఉంటదో ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.  కానీ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్​ అసెంబ్లీకే రావడం లేదని, దీన్ని ఏవిధంగా చూడాలన్నారు. ‘‘ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిది కాదు. అందుకే మీరు సభకు రండి. మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి, పాలకపక్షాన్ని ఇరుకునపెట్టండి. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీకు ఎంతో అనుభవం ఉంది కదా? ఆ అనుభవంతో మాకు మంచి సలహాలు ఇవ్వండి. నిర్దిష్టమైన సూచనలు చేయండి.  వయసులో, అనుభవంలో మీరు పెద్దవాళ్లు. ఆ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి” అని కేసీఆర్​కు సూచించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కేసీఆర్​ను ఆహ్వానించామని.. ఇప్పుడు డిసెంబర్ ​9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కూడా ఆహ్వానిస్తామని, భేషజాలకు పోకుండా రావాలని కోరారు. 

తమిళనాడులో రాజ‌‌కీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీల‌‌కు అతీతంగా వారంతా ఏక‌‌మ‌‌వుతారని.. మన రాష్ట్రంలో కూడా అలాంటి సంప్రదాయం నెలకొల్పుదామని కేసీఆర్​కు సూచన చేశారు. ‘‘మీ పిల్లలు(కేటీఆర్​, హరీశ్​రావు) తెల్వక అల్లరిచిల్లర పనులు చేస్తున్నరు. వారిని కూర్చోబెట్టి మాట్లాడండి. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని చెప్పండి. అట్ల కాకుండా మారీచ, సుబాహుల్లా, రాహువు, కేతువుల్లా మా ప్రభుత్వం మీదికి ఉసిగొల్పడం మంచిదా? చంద్రశేఖర్​రావు గారు.. ఆలోచించండి” అని సీఎం అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్​ను గురువారం సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్​రెడ్డి ఆవిష్కరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్​ సమావేశాలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేసీఆర్​ వచ్చి 17 మంది లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏడుగురు రాజ్యసభ సభ్యుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. 

హరీశ్​, కేటీఆర్​ను కూసోపెట్టుకొని చెప్పండి

మొదటి 6నెలలు ఎన్నికల కోడ్​ వల్ల పాలనపై పెద్దగా దృష్టిపెట్టలేకపోయామని, అధికారులతో కనీసం సమీక్ష కూడా చేయలేకపోయామని సీఎం రేవంత్​ తెలిపారు. మిగిలిన ఐదారు నెలల్లో పరిపాలనను గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నామని.. కేసీఆర్​కు ఈమాత్రం అవగాహన ఉండాలి కదా అని అన్నారు. ‘‘హరీశ్​ది, కేటీఆర్​ది చిన్నపిల్లల మనస్తత్వం. పిల్లలు అవతలివాళ్ల దగ్గర మంచి ఆటబొమ్మ ఉందంటే అది కావాలనుకుంటరు. దక్కదనుకుంటే దాన్ని విరగొట్టి ఆనందం పొందుతరు. అలాంటి ఆలోచనవాళ్లిద్దరిది. తమ దగ్గర లేని అధికారం భట్టి విక్రమార్క దగ్గరో, రేవంత్​రెడ్డి దగ్గ రో ఎందుకుండాలె అని లాక్కునే ప్రయత్నం హరీశ్, కేటీఆర్​ చేస్తున్నరు” అని తెలిపారు. తాము చేసింది రూ.52 వేల కోట్ల అప్పు అని, అదే విషయాన్ని చెప్తే  కేటీఆర్​, హరీశ్​రావు లక్ష కోట్ల అప్పు చేశారంటూ బుకా యిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి సమయంలో అన్ని అనుభవాలు ఉన్న చంద్రశేఖర్​రావు ఆ ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి మంచి దారిన పెట్టాలి. అలా కాకుండా ఎటమటంగా వ్యవహరిస్తే  చట్టం తన పని తాను చేసుకపోతది. ప్రతిరోజూ మీ తప్పులను సరిదిద్దడం పక్కనపెడ్తే.. మీ అప్పులను మోయడానికి నడుం వంగిపోతున్నది. ప్రతినెలా రాష్ట్రంలో ఉద్యోగస్తులకు రూ.6,500 కోట్ల జీతాలు ఇస్తే  కేసీఆర్​ చేసిన అప్పుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో రూ.6,500 కోట్లు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్డీ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టాల్సి వస్తున్నది” అని సీఎం అన్నారు. 

కేసీఆర్​లో మానసిక పరివర్తన రావాలి 

2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో రాష్ట్రాన్ని కేసీఆర్​కు అప్పగిస్తే.. సరిగ్గా పదేండ్లలో ఆయన రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని తమకు అప్పజెప్పారని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఇన్ని అప్పులు చేయడమే కాకుండా వేల ఎకరాల భూములను అమ్మేశారని, లక్షల ఎకరాల పేదల భూములను గుంజుకున్నారని, అప్పులకు మిత్తి చెల్లించడానికి మళ్లీ అప్పుజేసే పరిస్థితి కల్పించారని అన్నారు. ‘‘మా చేతికి అధికారం రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గ్రహించి శాసనసభలో మా భట్టి విక్రమార్క వైట్​పేపర్​ ప్రవేశపెట్టిండు. అక్కడి నుంచి ఒక్కొక్కటే పరిష్కరించుకుంటూ మేం ముందుకువస్తున్నం. మీరు(బీఆర్​ఎస్​ పాలనలో) చేసిన తప్పులు సరిదిద్దేందుకు, అప్పులు తీర్చేందుకు మాకు  సమయం పడుతున్నది. ఇలాంటి టైంలో ప్రతిపక్ష పార్టీ నేతగా చంద్రశేఖర్​రావు మాకు సహకరించాలి. సమయం ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేసిన కేసీఆర్ తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత రాజశేఖర్ రెడ్డి.. రాజశేఖర్​రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నివేదికల రూపంలో అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ మంచి సంప్రదాయం ఉండె. 2008 ఉప ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఉన్న హరీశ్ రావు కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చిండు. 

కాంగ్రెస్ లో చేరేందుకే హరీశ్​రావు కలిశారనే విమర్శలు నాడు వచ్చినయ్​. కానీ, సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం రాజశేఖర్ రెడ్డిని కలిశానని హరీశ్  చెప్పిండు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడే రాజశేఖర్​రెడ్డిని హరీశ్​రావు కలిసిండు. మరి ఇప్పుడేమైంది?  ఏడేండ్లు నేను ప్రతిపక్షంలో ఉన్నా.. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులను , మంత్రులను కలిసి నిధులు రాబట్టుకునేది. నారాయణపేట– కొడంగల్ లిఫ్ట్​ స్కీం సహా పలు ప్రాజెక్టులను అట్లనే తెచ్చుకున్నం” అని గుర్తుచేశారు. గత పదేండ్ల బీఆర్​ఎస్  పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కేసీఆర్​ కలవలేదని,  పదేండ్లు ఆయన సచివాలయానికి కూడా రాలేదని, పదేండ్లు పాత సంప్రదాయాన్ని దెబ్బతీసి పాలకపక్షం, ప్రతిపక్షం అంటేనే శత్రువులు అన్నట్లుగా వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. ‘‘పది సంవత్సరాలు మీరు ఏం చేశారని మేము అడుగుతలేం. ప్రజలే గమనించి, మీకు ఇవ్వాల్సిన స్థానం ఇచ్చిన్రు.  ఇప్పటికైనా  మానసిక పరివర్తన రావాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా మీ విధానం ఏమిటో స్పష్టంచేయాలి. ఈ ప్రభుత్వమే నడవద్దా? ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవద్దా? తెలంగాణను​ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రభుత్వమంటే 64 మంది కాంగ్రెస్​ శాసనసభ్యులేనా? 119 మంది కలిస్తేనే ప్రభుత్వం. పాలకపక్షంగా విధానపరమైన నిర్ణయాలు చేసే బాధ్యతను జనం మాకు ఇచ్చిన్రు. వాటిని విశ్లేషించడం ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యతను మీకు ఇచ్చిన్రు. మన పాత్రలను మనం అందరం పోషించాలి” అని కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. 

పేదలకు ఇండ్లు కట్టియ్యలే కానీ..  ఆయన కట్టుకున్నడు

2004 నుంచి 2014 వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్ ప్రభుత్వం 25.04 ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షల ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఇండ్లు నిర్మించింద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్​ తెలిపారు. ‘‘ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఇండ్లను పిట్ట గూళ్లని.. కొడుకు, కోడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అల్లుడు, బిడ్డ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్తే ఎక్కడ ఉంటార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఎన్నిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప్రచార స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో విమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శలు గుప్పించిన కేసీఆర్ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేండ్ల పాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నా కాలంలో కేవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లం  65 వేల ఇండ్లు పూర్తి చేసిండు. గత కేసీఆర్ ప్రభుత్వం అసంపూర్తిగా వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిలేసిన 35 వేల ఇండ్ల పూర్తికి మేం రూ.195 కోట్లు కేటాయించాం. కేసీఆర్ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దేండ్ల కాలంలో డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేదు.. కానీ, ఆరు నెలల్లో ఆయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న కోసం కోట లాంటి ప్రగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తి భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, వాస్తు కోసం సెక్రటేరియెట్​ను, గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ్వేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్వాడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మించుకున్నరు. బీఆర్ఎస్ పార్టీ భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాల కోసం ఎక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాల కొద్ది భూమి కేటాయించుకున్నరు. కేసీఆర్ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ కాలంలో డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి చేయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేదు.. ఆయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న చెప్పిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్లు కోడి, మేక ఎక్కడ ఉండాలో చూప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేదని.. కానీ, కాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీకో బెల్టు షాపు పెట్టిచ్చిండు” అని విమర్శించారు. 

ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రత్యేక కోటా

సొంత ఇల్లును ఆత్మగౌరవంగా ప్రజలు భావిస్తారని.. ఆ కల నెరవేరాలనే ఇందిరా గాంధీ ఇండ్లు నిర్మించి ఇచ్చార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. ‘‘దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చెప్పగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను. కూడు.. గూడు.. గుడ్డ.. నినాదాన్ని ఇందిరా గాంధీ ఆచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చారు. సీలింగ్ యాక్ట్ ద్వారా గిరిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నులు, ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళితులకు మిగులు భూముల పంపిణీ చేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టారు. ఇండ్ల నిర్మాణం చేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టారు” అని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు, ఎన్టీఆర్ సీఎంగా ఉన్న కాలంలో గిరిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇండ్లు కేటాయించార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, ఆ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వాత కాలంలో వారికి ఇండ్ల కేటాయింపు సక్రమంగా జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లేద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ ప్రభుత్వం ఐటీడీఏల ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిధిలోని నియోజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గాల్లో గిరిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుల కోసం ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఇండ్ల కేటాయింపులో ప్రత్యేక కోటా ఇస్తుంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్​ వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన ప్రత్యేకంగా పరిశీలించి అదనంగా కొన్ని వేల ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు.  ఇప్పుడు కేటాయించిన ఇండ్లు కాకుండా ఆదివాసీలకు ప్రత్యేక కోటా ఇస్తామని తెలిపారు. నల్లమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లలోని చెంచులు.. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గోండులు.. భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్రాచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లంలోని కోయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. ఎవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైతే తెలంగాణ మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టి మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుషులో, తెలంగాణ మూల పురుషులో వారికి ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఇండ్లను ఇస్తామని ఆయన వెల్లడించారు. ఇంద్రవెల్లికి వెళ్లి తాను స్వయంగా ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఇండ్ల నిర్మాణ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టాలు అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేసిన విష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాన్ని ఈ సంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్భంగా సీఎం గుర్తుచేశారు.  

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ రెడ్డి, బండి సంజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఆహ్వానం

ఈ నెల 9న సెక్రటేరియెట్​లో తెలంగాణ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్భంగా 7, 8, 9 తేదీల్లో సెక్రటేరియెట్​ ప్రాంగణం.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర ప్రాంతాల్లో తెలంగాణ సంబురాలు అద్భుతంగా నిర్వహించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నున్నట్లు చెప్పారు. తెలంగాణ  సంస్కృతికి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టం క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టే కార్యక్రమాలు, పిండి వంట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హిళా సంఘాల స్టాళ్లతో ఒక పండుగ వాతావార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణం నెలకొంటుంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. బోనాలు, వినాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క నిమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ్జనం చేసుకునేప్పుడు ఎలాంటి వాతావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణం ఉంటుందో అలాంటి వాతావ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణం ఇప్పుడు ఉంటుందని, ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లంతా వాటిలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లి విగ్రహావిష్కర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ష నేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేంద్ర మంత్రులు కిష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్ రెడ్డి, బండి సంజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఎంఐఎం, సీపీఐ, ఇత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర ప్రతిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ష నేత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ స్వయంగా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిసి ఆహ్వానిస్తార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని వెల్లడించారు. ఈ ఉత్సవానికి ప్రతిప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్ష నేత వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చి పెద్దరికం నిలుపుకోవాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్​ కోరారు. 

స్థోమతకు తగ్గట్లు ఎక్కువ కట్టుకోవచ్చు

ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఇండ్ల నిర్మాణంలో ఫలానా న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మూనానే పాటించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తాము సూచించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం లేద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, అదే స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంలో త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కున్న స్థలంలో ప్రతి అంగుళాన్ని ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్ధిదారులు వినియోగించు కునేలా ప్రతి మండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కేంద్రంలో మోడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మిస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని.. ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్ధిదారులు అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాహ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న కోసం వాటిని చూడాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ‘‘ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్ధిదారులు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ స్థోమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్గట్లు అద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పు గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దులు నిర్మించుకునే వెసులు బాటు క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్పిస్తున్నం. లక్ష్యం ఎంత గొప్పదైనా అమల్లో లోపాలు ఉంటే ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతింటుంది.. పేదవాళ్లకు అన్యాయం జరుగు తుందనే ఆలోచనతోనే ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఇండ్ల కోసం వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చిన ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఖాస్తుల ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా వినియోగిస్తున్నం. పునాది స్థాయి నుంచి స్లాబు స్థాయి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతి ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ సాంకేతిక నైపుణ్యాన్ని ఉప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యోగించి అర్హుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఇండ్లు అందేలా చూస్తం” అని వెల్లడించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్దు చేసిన గృహ నిర్మాణ శాఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పున‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రుద్ధరించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మే కాకుండా ఆ శాఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పూర్తి స్థాయి సిబ్బందిని ఇస్తున్నామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఇండ్ల కోసం గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తంలో తీసుకున్న రుణాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాఫీ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.  

విడతల వారీగా గ్రీన్ చాన​ల్ నిధులు

ప్రతి అసెంబ్లీ నియోజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్గానికి 3,500 ఇండ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షల ఇందిర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్రక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టించారు. ఇలా ఐదేండ్లలో 25 లక్షల ఇండ్లు పేద వాళ్లకు ఇస్తామన్నా రు. ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షలు ఇస్తున్నామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చెప్పారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా.. గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చానల్ ద్వారా ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్ధిదారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.5 ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షలు విడతల వారీగా అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని వివరించారు. తొలి ఏడాదిలో.. సొంత స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని.. దివ్యాంగులు, వ్యవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సాయ కూలీలు, పారిశుద్ధ్య సిబ్బంది, ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ళితులు, గిరిజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లు, వితంతువులు,  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జెండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్లకు ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆయన వెల్లడించారు. 

ఇండ్ల కోసం ఈ ఏడాది రూ.22,500 కోట్లు: భట్టి

రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో బతకడానికని.. ఇందిరమ్మ ఇల్లు కావాలని పెద్ద ఎత్తున ప్రజలు కోరారని, వారి కలను నెరవేరుస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘అందరి కోరిక మేరకు ప్రజా ప్రభుత్వం ఏర్పడింది.  అందరి ఆవేదన అర్థం చేసుకొని ఎంతటి నిధుల భారం అయినప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపడ్తున్నాం. ఈ ఏడాది నాలుగున్నర లక్షల కుటుంబాలకు రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నం” అని వెల్లడించారు.  రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా రూ.21 వేల కోట్ల నగదును రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే తమకు రూ.7 లక్షల కోట్ల అప్పుతో కేసీఆర్​ అప్పగించారని అన్నారు.  ‘‘ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 కే గ్యాస్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్​,  సన్నవడ్లకు రూ. 500 బోనస్​ వంటి పథకాలు అమలు చేస్తున్నం” అని అన్నారు.

పార్టీలకతీతంగా పేదలకు ఇండ్లు: పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరు ఒక్క పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘‘పార్టీలకు అతీతంగా కుల, మతాలకు సంబంధం లేకుండా.. అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం” అని వెల్లడించారు. పేద వాడి చిరు ఆశ.. చివరి ఆశ కూడా ఇల్లేనని తెలిపారు. నాలుగు విడతల్లో ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. ప్రజాపాలనలో లక్షలాది దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. శుక్రవారం నుంచి ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లి సర్వే చేస్తారని ఆయన చెప్పారు. ఎవరు కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్క పైసా ఇవ్వొద్దని.. అర్హులందరికీ తప్పకుండా ఇండ్లు మంజూరవుతాయని తెలిపారు.  

మమ్మల్ని చూడటం నామోషీ అనిపిస్తే..  స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వండి

‘‘మీ(కేసీఆర్​) మనసులో బాధ, దు:ఖం ఏమైనా ఉంటే పక్కనపెట్టండి. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే గొప్పది. నిజాం అంతటి రాజు సాయుధ పోరాటానికి తలొగ్గి  హైదరాబాద్​  రాజ్యాన్ని భారత యూనియన్​లో విలీనం చేసిండు కదా? అట్లనే ప్రజలు ఇచ్చిన తీర్పును  గౌరవించాలి. మరోసారి చెప్తున్నా.. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులుగా మిమ్మల్ని(కేసీఆర్​ను) గౌరవిస్తుంది. మీరు మీ బాధ్యత నెరవేర్చండి. మమ్మల్ని కుర్చీల్లో చూడడం నామోషీ అని ఒకవేళ మీరు ఫీలైతే కొంతకాలం స్వేచ్ఛగా మమ్మల్ని మా పనిచేయనివ్వండి. మీరు చేసిన తప్పులను సవరించుకుంటూ.. మీరు చేసిన అప్పులను కట్టుకుంటూ.. పరిపాలనను గాడిన పెట్టాలనుకుంటున్నం.”
- సీఎం రేవంత్​రెడ్డి