కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా ప్రతిపక్షంలోనే ఉండాలి..నేనిక్కడే ఉండాలి

కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా  ప్రతిపక్షంలోనే ఉండాలి..నేనిక్కడే ఉండాలి

కేసీఆర్ వందేళ్లు ఆయురారోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలన్నారు  రేవంత్. కేసీఆర్ సూచనలు ఇస్తూనే ఉండాలి..తాను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలని చెప్పారు .

కేసీఆర్ దగ్గర ఉన్న సీఎం కుర్చీని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు గుంజుకుని నాకిచ్చారు. కేసీఆర్ దగ్గర గుంజుకోవడానికి ఇంకేముంది. ఉన్నది ప్రతిపక్ష హోదానే అది నాకెందుకు కేటీఆర్,హరీశ్ రావులకు కావాలి. బీఆర్ఎస్ స్ట్రేచర్ పై  ఉందని నేను అన్నా. అందులో తప్పేముంది?.కేసీఆర్ అన్నట్లుగా హరీశ్ చిత్రీకరిస్తున్నాడు.తప్పుడు మాటలు నాకు ఆపాదిస్తున్నారు. కేసీఆర్ వందేళ్లు ఆరోగ్యంగా ప్రతిపక్షంలోనే ఉండాలి..నేను ఇక్కడే ఉండాలి అని రేవంత్ అన్నారు. 

ALSO READ | రొయ్యల పులుసు తిని.. ఏపీకి నీళ్లు దోచిపెట్టింది కేసీఆర్ కాదా.? : సీఎం రేవంత్ రెడ్డి

దుబాయ్ లో డ్రగ్స్ పార్టీలు చేసిన మొత్తం వ్యవహారం తెలుసన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దుబాయ్ నుంచి మొత్తం రికార్డులు తెప్పించానని.. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమున్నాయో గుట్టంతా రికార్డుల్లో ఉందనర్నారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు గుట్టు రట్లు అన్నీ బయటకు వస్తాయని.. త్వరలోనే కేటీఆర్ దుబాయ్ ఫైల్స్ బయటకు వస్తాయంటూ సంచలన విషయాలు అసెంబ్లీ సభలోనే వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.