ఇది సెమీ ఫైనల్స్ మాత్రమే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి

ఇది సెమీ ఫైనల్స్ మాత్రమే.. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా ఫైనల్స్: రేవంత్ రెడ్డి

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటి వరకు మనం సెమీ ఫైనల్స్ వరకే వచ్చామని.. 2029లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే మనం ఫైనల్స్ అని సీఎం రేవంత్ రెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. పార్టీ కార్యకర్తలు పని చేసి మమ్మల్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా గెలిపించారు. ఇప్పుడు టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కార్యకర్తలను జెడ్పీసీలు, ఎంపీటీలు, సర్పంచులుగా గెలిపించాల్సిన బాధ్యత మాపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నుంచి మహేశ్ కుమార్ కార్యకర్తలను సమన్వయం చేసి.. పార్టీని ముందంజలో నడిపిస్తారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ క్యాడర్ ఇదే ఉత్సాహంతో పని చేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి టీపీసీసీ పదవిని మహేశ్ కుమార్ గౌడ్ కు అప్పగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘పీపీసీ చీఫ్ గా హైకామాండ్ ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చా. ఇంద్రవల్లి దలిత గిరిజన దండోరాతో సమరశంఖం పూరించాము. అధికారంలోని రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10లక్షల వరకు పెంచామన్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభతో రైతాంగానికి భరోసా ఇచ్చాం. రైతు రుణమాఫీ హామి ఇచ్చిన మాట ప్రకారం .. రూ.2లక్షల రైతు రుణమాఫీ అమలు చేశామన్నారు. రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేస్తున్నామన్నారు.  

ఎన్నో పోరాటాల తర్వాత స్వరాష్ట్రం సాధించాము. పార్టీ పగ్గాలు చేపట్టిన దగ్గరి నుంచి పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లాము. తుక్కుగూడ సభ వేదికగా ఆరు గ్యారెంటీలు హామి ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటి అమలు కోసమే పని చేస్తున్నామని’ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఆగస్ట్ 15లోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తా అన్న సన్నాసి ఎక్కడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సోనియా గాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. రూ.2లక్షల రుణమాఫీ చేసి, వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని నిరూపించామన్నారు.

Also Read :- పార్టీకోసం కష్టపడిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు