రాజ్యాంగ సవరణపై వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2000 సంవత్సరంలో వెంకటాచలయ్య కమిషన్ వేశారని..ఇందులో 10 మంది సభ్యులున్నారనిచెప్పారు. 2002లో వెంకటాచలయ్య కమిషన్ నివేధిక ఇస్తే దానిని సీక్రెట్ గా పెట్టారని ఆరోపించారు. ఇపుడు రహస్య ఎజెండాను అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ పెద్దలు కులాల ఆధారిత రిజర్వేషన్లు ఉండొద్దన్నారని చెప్పారు.
రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని ఆరోపించారు సీఎం రేవంత్. రాజ్యాంగాన్ని ఏవిధంగానైనా మార్చాలని ప్రయత్నిస్తోందన్నారు. కులాల వారిగా రిజర్వేషన్లు రద్దే వారి ఎజెండా అని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దుచేయడమే ఎజెండా అని అన్నారు. 1978లో వెనుకబడిన తరగతులకు బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే.. వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం నడిపారని చెప్పారు.
రిజర్వేషన్లపై తాను మాట్లాడిన తర్వాత దేశ స్థాయిలో చర్చకు రావడంతో బీజేపీ కప్పిపుచ్చుకుంటోందని చెప్పారు. రిజర్వేషన్లపై చర్చకు రాకుండా బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. కుట్రలో భాగంగానే తనపై ఢిల్లీలో కేసు పెట్టారని .. స్వయంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసిందన్నారు.
ఢిల్లీ సుల్తానులు బెదిరిస్తే తాను భయపడే రకం కాదన్నారు. బీజేపీ కుట్రలు తిప్పి కొట్టేందుకు తన బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పారు రేవంత్. సీఎంగా దళితులు, పేదలకు అండగా ఉంటానని తెలిపారు. రిజర్వేషన్లపై మోదీ అమిత్ షా, మీ పార్టీ ఆలోచన ఏంటో స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు రేవంత్.