హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం: సీఎం రేవంత్

హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం: సీఎం రేవంత్

హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎంఐఎంతో కలిసి పనిచేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీతో కొట్లాడాల్సి వస్తే కొట్లాడుతా.. అసదుద్దీన్ ఓవైసీతో కలావల్సి వస్తే కలుస్తానని చెప్పారు. కాంగ్రెస్ ,ఎంఐం కలిసి హైదరాబాద్  కోసం కలిసి పనిచేస్తాయన్నారు.  ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామని..ఎన్నికల తర్వాత  అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. కేంద్రంపై ఓత్తిడి తెచ్చి పనులు చేయించుకుంటామన్నారు రేవంత్.ఓల్డ్ సిటీకి మెట్రో కావాలని మోడీతో కొట్లాడి తీసుకొస్తున్నా.. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు  మెట్రో విస్తరణకు సహకరించాలని కోరా అని చెప్పారు రేవంత్.

 ఓవైసీ బ్రదర్స్ తండ్రిబాటలోనే అబివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎంఐఎం సహకారంతో పాతబస్తీని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు రేవంత్. పాతబస్తీలో మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.ఇది ఓల్డ్ సిటీ కాదు..ఒరిజనల్ సిటీ అని అన్నారు రేవంత్. గత పదేళ్లలో మెట్రో విస్తరణ పనులను పట్టించుకోలేదన్నారు.  త్వరలో ఎంఐఎం ఎమ్మెల్యేలను పిలిచి నగర అభివృద్ధి  కోసం చర్చిస్తామన్నారు రేవంత్. మీరాలం ట్యాంక్ పై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు.  ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మిస్తామన్నారు రేవంత్.  

అరాంఘర్ ఫ్లై ఓవర్ కు మన్మోహన్ సింగ్ పేరు

ఉమ్మడి రాష్ట్రంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ పీవీ ఎక్స్ ప్రెస్ వే ..  నగరంలోనే  రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ అరాంఘర్ ఫ్లై ఓవర్ అని అన్నారు రేవంత్.   కాంగ్రెస్ హయాంలోనే పీవీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం జరిగిందన్నారు.  మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు.  మనకు మనమే  పోటీ అని మరోసారి నిరూపించుకున్నాం..   అధికారంలోకి రాగానే పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నామన్నారు.  హైదరాబాద్ లో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.  నిజాములు హైదరాబాద్ ను లేక్ సిటీగా తీర్చిదిద్దారని తెలిపారు.  కబ్జాదారులతో సుందరీకరణ దెబ్బతింటుందన్నారు.  రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే రాష్ట్రం రూపురేఖలు మారిపోతయన్నారు రేవంత్.   పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయన్నారు రేవంత్..