గుడ్ న్యూస్ : మహిళలకు ఏడాదికి రెండు క్వాలిటీ చీరలు : సీఎం రేవంత్

గుడ్ న్యూస్ : మహిళలకు ఏడాదికి రెండు క్వాలిటీ చీరలు : సీఎం రేవంత్

త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన రేవంత్..సొంత ఆడబిడ్డలకు ఇచ్చినట్లు నాణ్యమైన చీరలను అందిస్తామన్నారు.అన్ని రంగాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశాం 

 ఇందిరా మహిళా శక్తిలో 67 లక్ష్లల  మంది ఉన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తాం. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశాం 
1000 మెగావాట్ల సోలార్ పవర్ ను మహిళా సంఘాలకు అప్పగించాం. మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తాం. శిల్పారామం పక్కనే పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత ఎదగాలి.  గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదు. 1000 కోట్లతో మహిళా సమాఖ్య  సభ్యులకు  చీరలు ఇస్తాం. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఏడాదిలో రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం మామూలు  చీరలు ఇచ్చేది..మేం నాణ్యమైన చీరలు ఇస్తాం. అని రేవంత్ అన్నారు.

ALSO READ | కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్

రూరల్, అర్బన్ అనే తేడా లేదు  తెలంగాణలో మహిళలంతా ఒక్కటే. అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందాం. ఎంపీ డీకే అరుణ  కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళల అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం.  పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిధులు మేం ఇస్తాం..నిర్వహణ మీరు చేయండి. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అలాగే నిర్వహించుకోవాలి అని రేవంత్ సూచించారు.