
యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతీ సీఎంకు ఒక్క బ్రాండ్ ఉంది. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, రూ.2కిలో బియ్యం అంటే ఎన్టీఆర్, ఐటీ అంటే చంద్రబాబాబు గుర్తొస్తారని అన్నారు. ఇక ఉద్యమాన్ని కొందరు తమ బ్రాండ్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు.. 16 నెలలైనా బ్రాండ్ ఎందుకు సృష్టించుకోలేదని కొందరు నన్ను అడిగారు. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ అని రేవంత్ అన్నారు.
ALSO READ | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్
సౌత్ కొరియాకు ఒలింపిక్స్ లో 32 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 140 కోట్ల మంది జనాభా ఉన్న భారత్ కు ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు. చిన్న స్పోర్ట్స్ వర్శిటీ సౌత్ కొరియా ఖ్యాతిని పెంచింది. తెలంగాణ ప్రతి ఏడాది లక్షా 10 వేల ఇంజినీర్లను తయారు చేస్తోంది. కొందరు ఇంజినీర్లు అప్లికేషన్ కూడా నింపలేకపోతున్నారు. త్వరలోయంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్శిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. యంగ్ ఇండియా వర్శిటీలో నాలుగేళ్లు చదివితే డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. స్కిల్ వర్శిటీలో చదివిన వారికే 100 శాతం ఉద్యోగాలు. ప్రతీ సెగ్మెంట్ కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. వీటి కోసం 11.500 కోట్లు ఖర్చు చేస్తాం. ప్రభుత్వ విద్యారంగంలోనే చిన్న అస్పష్టత ఉంది. రాష్ట్రంలో 29,500 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. 18 లక్షల 50 వేల స్టూడెంట్స్ ఉన్నారు.
పోలీసుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తాం. హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు పోలీస్ పిల్లలను యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. పోలీస్ శాకతో నాకు అత్యంత అనుభందం ఉంది. గొప్ప గొప్ప యూనివర్శిటీలన్నీ నెహ్రూ స్థాపించినవే. తెలంగాణ బిడ్డ పీవీ దేశానికే దార్శనికుడయ్యారు. భవిష్యత్ తరాలకు ఏమి అవసరమో ఆ ప్రణాళికలు సిద్దం చేయడమే మా ప్రాధాన్యత. కొందరు తీసుకునే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆర్మీ స్కూళ్లతో మనం పోటీ పడలేమా? త్వరలోనే ప్రభుత్వ స్కూళ్లలో కూడా నర్సీరీ,ఎల్ కేజీ,యూకేజీ తీసుకొస్తాం. పిల్లలకు ట్రాన్స్ ఫోర్ట్ ఫెసిలిటీ తీసుకొస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.