ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.3.48 కోట్లు మంజూరు

ఆర్మూర్ నియోజకవర్గానికి రూ.3.48 కోట్లు మంజూరు

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ నియోజకవర్గానికి ఎంజీఎన్​ఆర్​ఈజీఎస్ పథకం ద్వారా రూ.3.48 కోట్లు నిధులను సీఎం రేవంత్​ రెడ్డి మంజూరు చేశారని ఆర్మూర్​ కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్​రెడ్డిని కలిసి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.