డ్రగ్స్​ అమ్మినా, తీసుకున్నా.. కరెంట్, నీళ్లు కట్: సీఎం రేవంత్

డ్రగ్స్​ అమ్మినా, తీసుకున్నా.. కరెంట్, నీళ్లు కట్: సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉక్కుపాదం మోపుతున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ‘‘డ్రగ్స్ అమ్ముతూ, తీసుకుంటూ దొరికినా.. వారి ఇండ్లకు కరెంట్, నీళ్లు కట్​ చేస్తం. దొరికిన వాళ్లు ఎంత పెద్దోళ్లయినా సరే చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు పంపిస్తం” అని హెచ్చరించారు. డ్రగ్స్​మహమ్మారిని అంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.250 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ​ఒవైసీ, పాయల్​ శంకర్, కూనంనేని సాంబశివరావు లేవనెత్తిన సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

‘‘హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా, అండర్​ గ్రౌండ్​ రోడ్లు అభివృద్ధి చేసినా ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గడం లేదు. పబ్లిక్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరుస్తున్నా జనాలు ఇప్పటికీ సొంత వాహనాల్లోనే ప్రయాణిస్తున్నారు. మెట్రో విస్తరణ, ఎలివేటెడ్​ కారిడార్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతిరోజూ 1,600 కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. సింగపూర్​లాంటి దేశాల్లో కొత్త వాహనం కొనుగోలు చేస్తే, పాత వాహనాన్ని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ ఆ పరిస్థితి లేదు. మల్టీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్​ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. అమెరికా వంటి దేశాల్లో ఎన్ని పైసలున్నోళ్లయినా పబ్లిక్ ​ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులోనే వెళ్తుంటారు. లేదంటే నలుగురైదుగురు కలిసి ఒకే కారులో ప్రయాణిస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ఒక కుటుంబంలో నలుగురుంటే.. వేర్వేరు కార్లలో వెళ్తుంటారు. కొత్త వాహనాలు కొనొద్దని నేను అనట్లేదు. కానీ, నలుగురైదుగురు వెళ్లే వాహనాలను ఒక రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, ఒక్కరు మాత్రమే వెళ్లే వాహనాలను మరో రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెళ్లేలా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది” అని రేవంత్ అన్నారు.  

మరో ఢిల్లీలా కావొద్దు..

హైదరాబాద్ ​మరో ఢిల్లీలా కావొద్దని సీఎం రేవంత్​అన్నారు. ‘‘ఢిల్లీలో కాలుష్యం వల్ల స్కూళ్లు, ఆఫీసులు మూతపడుతున్నాయి. ఇక్కడా ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎలక్ట్రిక్​ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించాలి. సిటీలో 3 వేల డీజిల్​బస్సులున్నాయి. వాటిని పల్లెలకు పంపించి ఇక్కడ ఎలక్ట్రిక్​ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కాలుష్యం వెదజల్లే ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్​ఆటోలను ప్రమోట్​ చేయాలి. వాటిని కొనుగోలు చేసేవారికి ఆర్థిక సహకారం కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. 

సిటీలోని పరిశ్రమలను ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్యన ఇండస్ట్రియల్​కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షిఫ్ట్​ చేస్తాం. రాష్ట్రంలో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. గత పదేండ్లలో ఒక్క కొత్త ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టునూ తీసుకురాలేకపోయారు. ప్రస్తుతం వరంగల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టును తీసుకొచ్చాం. కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్​, జక్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులను ఒక్కొక్కటిగా తీసుకొస్తం. పాతబస్తీ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మెట్రో, రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్​గ్రౌండ్​డ్రైనేజీ వ్యవస్థలన్నింటినీ తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతున్నది. ఇబ్రహీంపట్నంలో మార్కెట్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా ప్రస్తు త మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుకునేందుకు వీలుగా వెంటనే ఉత్తర్వులు ఇస్తాం. కానీ, కొత్తది పూర్తయ్యాక.. పాత మార్కెట్ ఉండదు. అప్పుడు రెండూ కావాలంటే కుదరదు” అని స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్ల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.