పాలమూరు పూర్తి చేసి ఉంటే.. ఏపీతో పంచాయతీ ఉండేది కాదు: సీఎం రేవంత్ రెడ్డి

పాలమూరు పూర్తి చేసి ఉంటే.. ఏపీతో పంచాయతీ ఉండేది కాదు: సీఎం రేవంత్ రెడ్డి

 పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇవాళ ఏపీతో పంచాయతీ ఉండేది కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్.. పాలమూరు జిల్లాపై గత పాలకులు కక్ష కట్టారని ఆరోపించారు.  గత పదేండ్లలో పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. పాలమూరుకు రావాల్సిన నీళ్లు రాయలసీమకు తరలించారని ఆరోపించారు.   రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే  ఒక్కరోజు 10టీఎంసీలు మాయమైపోతాయి.. నెలలో శ్రీశైలం అంతా ఖాళీ అవుతుంది అని రేవంత్ అన్నారు. 

సీఎం రేవంత్ కామెంట్స్

 

  • కాంగ్రెస్ ప్రభుత్వం 2004నుంచి 2014 మధ్య 50 లక్షల ఇండ్లు కట్టింది
  • గత  పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వలేదు
  • డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో గత పాలకులు ఆశ చూపారు
  •  5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని టార్గెట్ పెట్టుకున్నాం
  • నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
  • పాలమూరు పేదరికాన్ని చూపించి గత పాలకులు మార్కెటింగ్ చేశారు
  •  ఏడు దశాబ్దాల తర్వాత పాలమూరు బిడ్డకు సీఎం అయ్యే అవకాశం వచ్చింది
  •  కేసీఆర్ కు ఎంపీ పదవి పాలమూరు ప్రజలు భిక్ష వేశారు
  • మేం భిక్ష వేస్తే 2009లో కేసీఆర్ ఎంపీ అయ్యారు
  • కృష్ణా నీళ్లు పక్కనే ఉన్నా పాలమూరు పొలాలు ఎందుకు పండలేదు 
  • పాలమూరును గత పాలకులు పట్టించుకోలేదు
  •  తెలంగాణ వచ్చాక కూడా పాలమూరుకు అన్యాయం జరిగింది
  • పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్ కు  ఓటు వేయలేదా?
  • ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో కేసీఆర్ దోచుకున్నారు
  • గత పదేళ్లు పాలమూరు ప్రాజెక్టులను కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదు
  •  జూరాల నీళ్ల శ్రీశైలం తరలించడంతో పాలమూరు ఎండిపోయింది.
  • పాలమూరు పూర్తి చేసి ఉంటే చంద్రబాబుతో పంచాదీ ఉండేది కాదు
  • జగన్ ను పిలిపించి రాయలసీ ఎత్తిపోతలకు  పథకం రచించిందే కేసీఆర్
  • ప్రగతి భవన్ కు  జగన్ ను పిలిపించి పంచభక్త పరమాన్నాలు పెట్టింది నువ్వు కాదా?
  • పాలమూరుకు రావాల్సిన నీళ్లు రాయలసీమకు తరలించారు
  • రాయలసీమ పూర్తయితే  ఒక్కరోజు 10టీఎంసీలు మాయమైపోతాయి
  • నెలలో శ్రీశైలం అంతా ఖాళీ అవుతుంది
  • రాజశేఖర్ రెడ్డి చెప్పులు మసి ఊడిగం చేసిందిక కేసీఆర్ కాదా?
  • లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే  వేల కోట్లు కేసీఆర్ మింగాడు
  • పదేండ్ల కేసీఆర్ పాలన,11 ఏండ్ల మోదీ పాలనపై చర్చకు బీఆర్ఎస్,బీజేపీ సిద్ధమా
  • చర్చకు కిషన్ రెడ్డి,  కేసీఆర్, హరీశ్, ఎవరు వస్తారు? 
  • ఆర్డీఎస్ ద్వారా నీళ్లు తరలించుకుపోయినప్పుడు హరీశ్ వైఎస్  కేబినెట్ లో మంత్రిగా ఉండు
  • కేసీఆర్ గట్టిగా కొడతాడంట  గట్టిగా కొట్టడానికి అది ఫుల్లా.. ఆఫా.. 
  • కేసీఆర్ .. కొట్టాలనుకుంటే ముందుగా మీ బిడ్డను ,కొడుకును, అల్లుడిని కొట్టు
  • గట్టిగా కొడితే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా?
  • మా పాలన బాగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తునన్నాయి.  ఏడాదిలోనే 21 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశాం
  • తొలి ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలిచ్చాం
  • పరిశ్రమలు ,ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నారు
  • లగచర్లలో గొడవ పెట్టాలని చూశారు..కలెక్టర్ ను చంపాలని చూశారు
  •  దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టలు కట్టినా పాలమూరు బిడ్డలే ఉంటారు
  • నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్,నారాయణపేట్ ,కొడంగల్ ప్రాజెక్టులను మొదలు పెట్టా
  • ఇచ్చిన హామీలను ఐదేళ్లలో పూర్తి చేసే బాధ్యత నాది