
ప్రపంచం వేగంగా మారుతోందని, కొత్త తరహా నేరాలు పెరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ HICC లో నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం అంత ఈజీ కాదని, అందుకోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ లో సీఎం కామెంట్స్:
- తెలంగాణ ప్రజలకు సంతోషంగా చెప్తున్న సైబర్ సెక్యూరిటీలో తెలంగాణ ముందుంది.
- సైబర్ నేరాల నియంత్రణలో అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం
- సైబర్ నేరాల నుండి ప్రజలను కాపాడేందుకు 1930 నెంబర్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది
- సమాజంలో చాలా వేగంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి..
- వాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..
- గతంలో హత్యలు అనేవి పెద్ద నేరాలుగా ఉండేవి..
- కానీ ప్రస్తుతం వాటికి మించి సైబర్ నేరాలు జరుగుతున్నాయి..
- ప్రజలు ప్రతి క్షణం సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి...
- వాటిని నియంత్రించడంలో తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ దేశంలోనే ముందుందని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పోలీస్ శాఖను సన్మానించి అభినందనలు తెలిపింది..
- సోషల్ మీడియా లో డీప్ ఫేక్ న్యూస్ లు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి..
- అలాంటి వాటి నుండి ప్రజలను కాపాడేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, SCSC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీల్డ్ 2025 కాంక్లేవ్ సైబర్ నేరాల నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డీప్ ఫేక్ దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.