
రాష్ట్రాన్ని ప్రపంచ చిత్ర పటంలో పెట్టాలని ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యధికంగా విదేశీ పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా ముందుకు వెళ్తున్నామన్నారు. 85 శాతం సొంత పన్నుల వసూళ్లతో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. బీఆర్ఎస్ నేతలు కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతున్నారు. గతంలో జానారెడ్డి.. విపక్ష నేతగా ప్రభుత్వానికి సహకరించారని... జానారెడ్డి నెలకొల్పిన సంప్రదాయాన్ని ఎందుకని కొనసాగించరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో అంతర్గత పోటీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందన్నారు సీఎం రేవంత్.
ALSO READ | కేసీఆర్ పదేళ్ల కష్టాన్ని నామారూపాల్లేకుండా చేశారు: జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు. హరీశ్ కాంగ్రెస్ లో చేరినా ..వేరే పార్టీలో చేరినా బై ఎలక్షన్ రాదు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మా దృష్టి అంతా రాష్ట్ర అభివృద్ధి పైనే. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసిన 2028లోనే ఎన్నికలు వస్తాయి' అని సీఎం స్పష్టం చేశారు. ‘పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతిరోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఎలాంటి సంప్రదాయం ఉందో అదే సంప్రదాయాన్ని మేం ఫాలో అవుతున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇచ్చింది. మేం ఎలాంటి పదవులు ఇవ్వడం లేదు. వాళ్ల అడుగుజాడల్లో మేం నడవడం లేదు. ప్రతి రోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉంది అని రేవంత్ అన్నారు.