ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ : సీఎం రేవంత్ రెడ్డి

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ : సీఎం రేవంత్  రెడ్డి

 బెట్టింగ్ యాప్, ఆన్ లైన్ గేమ్ ల పట్ల అసెంబ్లీలో  సీఎం రేవంత్ రెడ్డి కీలక  ప్రకటన చేశారు.  వీటిని నిరోధించడానికి  స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటు  చేస్తామని చెప్పారు. బెట్టింగ్ యాప్, ఆన్ లైన్ గేమ్ ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. మన పరిధిలో విచారణ జరిపిస్తే సమస్యకు సరైన పరిష్కారం దొరకదన్నారు రేవంత్. ఈ కేసులో శిక్షపడేలా ప్రత్యేక చట్టం చేస్తామన్నారు రేవంత్. 

 బెట్టింగ్ యాప్ ల వల్ల ఎంతో మంది బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్.  నేరం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోందన్నారు.  గుట్కా నిషేదం పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.  బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్లను విచారిస్తే సరిపోదు.. బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కూడా కఠిన చర్యలు ఉండాలన్నారు రేవంత్. 

ALSO READ | రేవంత్ మంచోడు కాబట్టే మీరింకా ఇలా ఉన్నారు.. లేదంటే..: MLA కోమటిరెడ్డి

 మమ్మల్ని చంపుతారని కోర్టులో  పిటిషన్ వేసినా వామనర్ రావు దంపతుల ప్రాణాలు దక్కలేదన్నారు రేవంత్ . వామన్ రావు హత్య ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్లను తప్పించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గంజాయి మత్తులో  సింగరేణి కాలనీలో ఆరేళ్బ చిన్నారిని దారుణంగా హత్య చేశారని చెప్పారు. 

శాంతి భద్రతలపై కొందరు  అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు రేవంత్.   పెట్టుబడుదారులకు రక్షణ కల్పించినప్పుడే  పెట్టుబడులొస్తాయని చెప్పారు.   తెలంగాణ అభివృద్ధిపై యాసిడ్ దాడులు జరుగుతున్నాయన్నారు.  రాష్ట్రం దివాళా తీస్తేనే మంచిదనేటట్లు  కొంతమంది  వ్యవహరిస్తున్నారని  విమర్శించారు రేవంత్.  తాము వచ్చిన  తర్వాత ఏక్కడైన గొడవలు జరిగాయా? అని ప్రశ్నించారు రేవంత్.