బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావటం వెనక బీజేపీ మద్దతు ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆప్ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియాకు బెయిల్ రావటానికి 15 నెలలు పట్టిందన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇంకా బెయిల్ రాలేదని.. ఆయన ఇంకా జైలులోనే ఉన్నారన్నారు. మరి కవితకు బెయిల్ వచ్చిందంటే.. బీజేపీ మద్దతు ఉండొచ్చని అనుకుంటున్నాను అన్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లలో గెలవటానికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు పని చేశారని.. అందులో భాగంగా.. బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చి ఉండొచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ALSO READ | తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత
బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటే అని.. లోపాయికారీ ఒప్పందం కింద పని చేస్తున్నారని.. అందులో భాగంగానే కవితకు బెయిల్ వచ్చే విధంగా బీజేపీ మద్దతు ఇచ్చి ఉండొచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి.