రాష్ట్రాలపై కేంద్రం సాంస్కృతిక దాడి, సమాజాన్ని చీల్చే కుట్ర: సీఎం రేవంత్

రాష్ట్రాలపై  కేంద్రం సాంస్కృతిక దాడి, సమాజాన్ని చీల్చే కుట్ర: సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రాలపై  కేంద్రం సాంస్కృతిక దాడి, సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ లోని బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. అక్కడ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం సరికాదని అన్నారు. యూనివర్సిటీలపై ఆధిపత్యం చెలాయించేలా కేంద్రం యూజీసీ నిబంధనలను తెస్తోందని, ఇది రాష్ట్రాల అధికారాలను కేంద్రం చేతిలోకి తీసుకోవడమేనని అన్నారు. 

సీఎం రేవంత్ వ్యాఖ్యలు..

రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉండాల్సిన యూనివర్సిటీలు కేంద్రం చేతికి తీసుకోవాలనుకోవడం దారుణం
రాష్ట్రాలపై కేంద్రం పెద్ద సాంస్కృతిక దాడి, కుట్ర చేస్తోంది
ఈ విషయంపై తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎం లతో మాట్లాడాం
రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీలు యూజీసీ ఆధ్వర్యంలోకి రావడం సరికాదు
యూజీసీ నిబంధనల వెనుక సమాజాన్ని చీల్చే కుట్ర జరుగుతోంది 
ఈ నిబంధనలను వెంటనే నిలిపివేయాలని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం
 యూజీసి నిబంధనలు రాజ్యాంగానికి విరుద్ధం
మా ప్రజల మీద, ప్రాంతాల మీద దండయాత్ర చేస్తున్నారు
ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. రాజ్యంగం మనుగడకు విఘాతం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో ఉమ్మడి బాధ్యతతో సహా.. రాష్ట్ర, కేంద్ర అధికారాలను స్పష్టంగా రాజ్యాంగంలో చెప్పారు
యూజీసీ నిబంధనలు మార్చాల్సి ఉంది
వర్సిటీలను గుంజుకునే కుట్ర కేంద్రం చేస్తోంది
కొత్త గైడ్ లైన్స్ ప్రకారం వైస్ ఛాన్స్ లర్ల నియామకం రాష్ట్రం చేతుల్లో ఉండదు
కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతుంది
దీనివలన రాష్ట్రాలు నిర్వీర్యం అవుతాయి
కేంద్రం పెత్తనంపై నిరసన కార్యక్రమాలకు సిద్ధం కావాలి
తెలంగాణ ప్రజల ఆలోచన విధానానికి, సామాజిక సమస్యల మీద విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయి
అధికారం ఉందని చెలాయించడం కరెక్టు కాదు
ఈ నిబంధనలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా నష్టం కలిగిస్తాయి
మొత్తం అధికారాలు కేంద్రం చేతికి వెళ్తే ఇక్కడ జీవచ్ఛవాలుగా మారే అవకాశం ఉంది
సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి కేంద్రంలో ఎవరైనా అధికారంలోకి రావచ్చు
భావోద్వేగాలతో కూడా కేంద్రం లో ఎవరైనా అధికారంలోకి రావచ్చు
మెజారిటీ ఉంది కదా అని రాష్ట్రాలపై పెత్తనం చెలాయిస్తామంటే సరికాదు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇది సరైన వేదిక అనే లైన్ దాటి మాట్లాడాను
ఏ విషయమైనా వేదికలను బట్టి  ప్రస్థావిస్తా..
రాజకీయ వేదికపై రాజకీయ అంశాలే మాట్లాడతా
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంగా రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడాలి కాబట్టి..
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోంది 
అందుకే రాజ్యాంగ దినోత్సవ వేదిక సందర్భంగా మాట్లాడుతున్నా
తెలంగాణకు ప్రధాని మరో అన్యాయం చేశారు
గద్ధర్, గోరటి, జయధీర్ వంటి వారిని పరిగణనలోకి తీసుకోక పోవడం దారుణం
పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారు
మంద కృష్ణకు ఇవ్వడం ఆహ్వానిస్తున్నాం
పక్క రాష్ట్రంలో 5 ఇచ్చినప్పుడ రాష్ట్రానికి 4 ఇచ్చినా బాగుండేది
త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నాం