అసెంబ్లీలో హరీశ్ రావు దుమ్ము దులిపిన రేవంత్

అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ రావుపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.  హరీశ్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిండు సభలో అబద్ధాలు మాట్లాడితే సహించమోన్నారు రేవంత్.   మోటార్లకు మీటర్లు పెడుతామని 2017లో అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది నిజం కాదా?అని ప్రశ్నించారు . ఆధారాలతో సహా డాక్యుమెంట్లను హరీశ్ కు ఇస్తున్నామని చెప్పారు.  అబద్ధాలను రికార్డ్ ల  నుంచి తొలగించకుంటే కొత్త సభ్యులు నిజమనుకుంటారని అన్నారు రేవంత్. బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. సభలో సభ్యులు తప్పు మాట్లాడితే సరిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు  రేవంత్..  ప్రతిపక్షానికి తగిన సమయం ఇచ్చామన్నారు. 

 తెలంగాణలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందన్నారు హరీశ్ రావు.  8 నెలల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు.  నిరుద్యోగ భృతికి బడ్జె్ట్ లో కేటాయింపులు లేవన్నారు.  హైదరాబాద్ సహా రాష్ట్రంలో మర్డర్లు, రేప్ లు జరిగాయని..లా అండ్ ఆర్డర్ ను కాపాడాలని కోరారు హరీశ్ రావు.