కొమిరెడ్డి జ్యోతి మృతి పట్ల సీఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్, వెలుగు : జిగిత్యాల జిల్లా మెట్ పల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే, అడ్వకేట్  కొమిరెడ్డి రాములు సతీమణి అయిన కొమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో  బెంగళూరులోని హాస్పిటల్ లో శుక్రవారం మృతి చెందారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.