
వేములవాడ, వెలుగు: ఈ నెల 7న సీఎం రేవంత్‌రెడ్డి రాజన్నసిరిసిల్ల జిల్లా పర్యటన రద్దయినట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సిరిసిల్ల, వేములవాడలో పర్యటిస్తారని తొలుత ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినా.. అత్యవసరంగా ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో రద్దు చేసినట్లు చెప్పారు. కాగా మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రభుత్వం తరఫున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌గౌడ్ రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆది శ్రీనివాస్ తెలిపారు.