సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల, వేములవాడ టూర్ రద్దయింది. అనివార్య కారణాల వల్ల మార్చి 7న సీఎం పర్యటన రద్దు అయినట్లు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. మార్చి 7న మహా శివరాత్రి జాతర ఉత్సవాల సందర్బంగా సీఎం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఇవాళ ఉదయం షెడ్యూల్ రిలీజ్ చేశారు. అయితే సీఎం పర్యటన రద్దుతో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు.
మార్చి 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఫైనల్ చేయడానికి సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారని సమాచారం.
షెడ్యూల్ ప్రకారం
మార్చి 7న షెడ్యూల్ ప్రకారం సిరిసిల్లలో నూతన ఎస్పీ భవన్ ను సీఎం రేవంత్ ప్రారంభించాలి . దీంతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు భూమిపూజ చేయాలి. వేములవాడ రాజన్నను దర్శించుకుని మహా శివరాత్రి సందర్భంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం గుడి చెరువు మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే పర్యటన రద్దు నేపథ్యంలో మళ్లీ జిల్లాలో సీఎం టూర్ ఉంటుందా? లేదా ? చూడాలి