పాలమూరు అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దొంగ దెబ్బ తీయాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చూస్తున్నాయన్నారు. ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ సెగ్మెంట్ ముద్దూరులో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ.. పీసీసీ పదవి, సీఎం పదవిని కొడంగల్ బిడ్డకు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. ఒకప్పుడు కొడంగల్‌కు ఏదైనా కావాలంటే చేయిచాపి అడగాల్సి ఉండేది.. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గమే అందరికీ ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే రూ.5 వేల కోట్లు నిధులు తీసుకువచ్చామని అన్నారు
సీఎం రేవంత్ రెడ్డి పాయింట్స్
- మక్తల్ ఎత్తిపోతలకు ఆనాడు డీకే అరుణ అడ్డుపడింది.
- కృష్ణా జలాలు, రైల్వే లైన్ రాకుండా ఆమె అడ్డుపడ్డారు.
- మంత్రిగా ఉండి డీకే అరుణ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు.
- శత్రువు చేతిలో కత్తివై పాలమూరు కంట్లో పొడుస్తున్నావు
- డీకే అరుణ సొంత సెగ్మెంట్ గద్వాలలోనే బీజేపీకి డిపాజిట్ రాలేదు.
- సీఎం వరకు నా ప్రస్తావన కొడంగల్ నుంచే ప్రారంభమైంది.
- కేసీఆర్ లా ఫామ్ హౌస్ పడుకోకుండా ప్రజల్లోకి వెళ్తున్నాం.
- వంశీని ఎంపీగా గెలిపిస్తే వందేళ్ల అభివృద్ధి చేసి చూపిస్తాం
- తాగుబోతు కేసీఆర్ కు రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల కుప్ప చేశాడు.
- కేసీఆర్ చేసిన అప్పుకు నాలుగు నెలల్లోనే రూ.26వేల కోట్ల మిత్తి కట్టాం.
- రూ.3వేల 9వందల కోట్ల లోటుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగించాడు.
- ఆడబిడ్డల ప్రయాణించేందుకు ఆర్టీసీకి రూ.13 వందల కోట్లు కట్టాం
- ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం
- పంద్రాగస్టులోగా రైతురుణ మాఫీ చేస్తే.. కేసీఆర్, హరీష్ రావులు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా?
- రైతులతో బ్యాంక్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు.. కాదని అలా చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు