
తెలంగాణ అవతరణ అంటే కేసీఆర్ కు గౌరవం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్థాన్ మాదిరే ఓ రోజు ముందే వేడుకలా అని ఫైర్ అయ్యారు. తెలంగాణ అంటే కేసీఆర్ కు వ్యాపారమని మండిపడ్డారు. ఆయన ప్రతిపక్ష నాయకుడా.. కమర్షియల్ వ్యాపారా? అంటూ చిట్ చాట్ లో ప్రశ్నించారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర ఇనుప కంచెలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మతిలేని కామెంట్స్ అని కొట్టిపడేశారు. ఎన్నికల కోడ్ ఉండటంతో.. తాను వెళ్లాలన్నా.. ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ దశాబ్ది వేడుకలకు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు రేవంత్.
గన్ పార్క్ అమరుల స్థూపం అంటే కెసిఆర్ కు ద్వేషమని.. అమరుల ఆనవాళ్లు ఉండటం కెసిఆర్ కు నచ్చదనన్నారు సీఎం. లోగోపై పలు సూచనలు వచ్చాయని.. వాటిపై చర్చిస్తున్నామని తెలిపారు. లోగోపై అభ్యంతరాలుంటే.. ప్రభుత్వానికి ఎందుకు సూచించలేదని ప్రశ్నించారు. ప్రకటించక ముందే ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు బీజేపీని కూడా ఆహ్వానించామన్నారు. కిషన్ రెడ్డి, దత్త్రాత్రేయలను ఆహ్వానించామని చెప్పారు.
వేడుకలను రాజకీయాలకు అతిథంగా నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర గీతంపై పూర్తి బాధ్యత, స్వేచ్ఛ కవి అందేశ్రీకి ఇచ్చామాన్నారు. ఎవరితో పాడించాలన్నది అందెశ్రీ నిర్ణయానికే వదిలేశామని చెప్పారు సీఎం. తెలంగాణ సమాజం పాడినట్లుగా రాష్ట్ర గీతం ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని.. బహిరంగ చర్చకు తాను సిద్ధమన బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా లాగ్ బుక్ లను చూపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.